Road Accident: సంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం.. ముగ్గురు మృతి
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం (Road Accident) సంభవించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు దగ్గర ఓఆర్‌ఆర్‌పై లారీ బీభత్సం సృష్టించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి అదుపుతప్పి లారీ గుడిసెలోకి దూసుకెళ్లింది.
- By Gopichand Published Date - 09:00 AM, Thu - 2 March 23

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం (Road Accident) సంభవించింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు దగ్గర ఓఆర్‌ఆర్‌పై లారీ బీభత్సం సృష్టించింది. ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి అదుపుతప్పి లారీ గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ పటాన్ చెరు నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.మృతులు ఓఆర్‌ఆర్ పక్కన చెట్లకు నీళ్లు పోసే కార్మికులుగా గుర్తించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం