AP Cabinet Meet : 20న ఏపీ క్యాబినెట్ భేటీ .. మరుసటి రోజు నుంచే అసెంబ్లీ సెషన్ ?
AP Cabinet Meet : సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వ క్యాబినెట్ ఈ నెల 20న సమావేశం కానుంది.
- Author : Pasha
Date : 13-09-2023 - 1:09 IST
Published By : Hashtagu Telugu Desk
AP Cabinet Meet : సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వ క్యాబినెట్ ఈ నెల 20న సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. ఈసారి సెషన్ లో ప్రవేశ పెట్టనున్న పలు బిల్లులపై కూడా కేబినెట్ మీటింగ్ లో చర్చ జరుగనుంది. ఈ మీటింగ్ అయిన మరుసటి రోజే (ఈ నెల 21) ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈసారి అసెంబ్లీ సెషన్స్ ఐదు రోజుల పాటు జరుగుతాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఒకవేళ అవసరమైతే ఇంకో రెండు రోజుల పాటు సెషన్ ను పొడిగించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు, సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్ బిల్లును ఈసారి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందట. ఇంకా కొన్ని కొత్త ఆర్డినెన్స్‌లు, బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.