State Cabinet : ఈనెల 6న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు ప్రత్యేక బిల్లులను ఆమోదించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.
- By Latha Suma Published Date - 04:02 PM, Tue - 4 March 25

State Cabinet : ఈ నెల 6న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం సెక్రటేరియట్‌లో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుల ఆమోదంపై ప్రధానంగా సమాలోచనలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు ప్రత్యేక బిల్లులను ఆమోదించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. పలు ప్రాజెక్టులపై చర్చించారు. ఈ ప్రాజెక్టులపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశముంది.
Read Also: IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఎవరూ గెలుస్తారో తెలుసా?
రాష్ట్రంలో నిర్వహించిన రెండో విడత కులగణన సర్వే ఫలితాలను కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. అలాగే, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు లబ్ది చేకూరేలా కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న బీసీ రిజర్వేషన్ల బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించనున్నారు.
ఈ సమావేశంలో ఆయా పథకాల గురించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది. ఈనెల రెండో వారంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఉన్న అంశాల గురించి కూడా సమావేశంలో కీలక చర్చ జరుగనుంది. ఈ బిల్లుకు పార్లమెంటరీ చట్టబద్ధత కల్పించి, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ధృడంగా సంకల్పించింది.
Read Also: Electricity Charges : ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు.. జగన్‌దే పాపం : మంత్రి గొట్టిపాటి