HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >They Increased The Charges They Staged The Protests Jagans Fault Minister Gottipati

Electricity Charges : ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు.. జగన్‌దే పాపం : మంత్రి గొట్టిపాటి

జగన్‌ హయాంలో విద్యుత్‌ రంగంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రజలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని మంత్రి రవికుమార్‌ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు. 

  • Author : Latha Suma Date : 04-03-2025 - 3:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
They increased the charges, they staged the protests.. Jagan's fault: Minister Gottipati
They increased the charges, they staged the protests.. Jagan's fault: Minister Gottipati

Electricity Charges : విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ ఛార్జీల పెంపు అంశంపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇంధన సర్దుబాటు ఛార్జీల పాపం వైసీపీ అధినేత జగన్‌దేనని ఆరోపించారు. ఆయన ఐదేళ్ల పాలనలో విద్యుత్‌ రంగంలో చేసిన పాపాలే ఇప్పుడు ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో ప్రజలకు ఉరితాళ్లయ్యాయని విమర్శించారు. జగన్‌ హయాంలో విద్యుత్‌ రంగంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రజలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని మంత్రి రవికుమార్‌ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.  పీపీఏలను రద్దు చేయడం, ఏపీ జెన్‌కోను దెబ్బతీయడం, ప్రజావసరాల పేరుతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక రేట్లకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వంటి చర్యలు ప్రజలకు భారంగా మారాయని తెలిపారు.

Read Also: RTC : మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు : ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !

డిస్కంలు ఇంధన సర్దుబాటు ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీకి ప్రతిపాదించినప్పటికీ, 2024 ఎన్నికల వేళ వీటిని వసూలు చేస్తే, నాటి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని వాయిదా వేశారని మంత్రి రవికుమార్‌ తెలిపారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు అనుమతించారని ఆయన ఆరోపించారు. జగన్‌ హయాంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రజలు సర్దుబాటు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని, 2023-24 సంవత్సరానికి మరో రూ.11,826 కోట్ల భారం ప్రజలపై పడబోతోందని మంత్రి రవికుమార్‌ పేర్కొన్నారు. ఇక, ఈ వేసవి కాలంలో రోజువారీ విద్యుత్ వినియోగం 260 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి.

ముందస్తు ప్రణాళికలతో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని మంత్రి సూచించారు.పెరుగుతున్నవిద్యుత్ వినియోగ డిమాండ్‌ను తీర్చడానికి ప్ర‌త్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని, ముఖ్యంగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 22,709 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చింది. డిమాండ్ మేరకు రైతులకు అవసరమైన‌న్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి అధికారులు సిద్దంగా ఉండాలి. వేసవి కాలంలో ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కనెక్షన్ల ప్రాసెసింగ్ వేగవంతం చేయాలి అన్నారు. అలాగే ఆర్డీఎస్‌ఎస్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ పంపిణీ సామర్థ్యాలను పెంచుకోవ‌డం, నష్టాలను తగ్గించడం, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ మిషన్ నెట్వర్కలను ఆధునీకరించడంపై అధికారులు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు.

Read Also: INDvAUS : టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Electricity Charges
  • Electricity sector
  • Electricity tariff hike
  • gottipati ravi kumar
  • Legislative Council
  • tdp
  • YCP members
  • ys jagan
  • ysrcp

Related News

NRI TDP

TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్‌ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd