Inter Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
జనవరి 29వ తేదీన ఇంటర్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, జనవరి 30వ తేదీన పర్యావరణ పరీక్ష నిర్వహించనున్నట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 07:42 PM, Mon - 16 December 24

Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ వార్షిక పరీక్ష షెడ్యూల్ సోమవారం విడుదలైంది. వచ్చే ఏడాది (2025) మార్చి 5 నుంచి 25 వరకు TS Intermediate 1st Year 2nd Year Exams జరగనున్నాయి. అలాగే ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 29వ తేదీన ఇంటర్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, జనవరి 30వ తేదీన పర్యావరణ పరీక్ష నిర్వహించనున్నట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు.
ఇక, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జనవరి 31వ తేదీన, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Telangana 1st Year Exams Time Table 2025
05.03.2025 – పార్ట్-2 సెకండ్ లాంగ్వేజ్
07.03.2025 – పార్ట్-1 ఇంగ్లీష్ పేపర్
11.03.2025 – మాథ్స్ పేపర్ 1ఏ, బోటని పేపర్-1 , పొలిటికల్ సైన్స్ పేపర్-1
13.03.2025 – మ్యాథ్స్ పేపర్ 1బీ , జువాలజి పేపర్ -1, హిస్టరీ పేపర్-1
17.03.2025 – ఫిజిక్స్ , ఎకనామిక్స్
19.03.2025 – కెమిస్ట్రీ , కామర్స్
21.03.2025 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు)
24.03.2025 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1
Telangana 2nd Year Exams Time Table 2025
06.03.2025 – పార్ట్-2 సెకండ్ లాంగ్వేజ్
10.03.2025 – పార్ట్-1 ఇంగ్లీష్
12.03.2025 – మాథ్స్ పేపర్ 2ఏ, బోటని, పొలిటికల్ సైన్స్
15.03.2025 – మ్యాథ్స్ పేపర్ 2బీ, జువాలజి, హిస్టరీ
18.03.2025 – ఫిజిక్స్, ఎకనామిక్స్
20.03.2025 – కెమిస్ట్రీ, కామర్స్
22.03.2025 – పబ్లిక్ అడ్మినిస్టరేషన్ పేపర్ 2 / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ 2 (బైపీసీ విద్యార్థులకు)
25.03.2025 – మోడ్రన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 / జాగ్రఫీ
Read Also: Jasprit Bumrah : సారీ చెప్పిన కామెంటేటర్, జస్ప్రీత్ బుమ్రా ఫ్యాన్స్ తడఖా