Jasprit Bumrah : సారీ చెప్పిన కామెంటేటర్, జస్ప్రీత్ బుమ్రా ఫ్యాన్స్ తడఖా
Jasprit Bumrah : ఇప్పుడు బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీశాడు. దీంతో జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి
- By Sudheer Published Date - 07:23 PM, Mon - 16 December 24

ఆసీస్ గడ్డపై జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన జెస్సీ రెండో టెస్టులో 4 వికెట్లతో సత్త్త చాటాడు. ఇప్పుడు బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీశాడు. దీంతో జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాను తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపిస్తున్న బుమ్రాపై ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా సైతం ప్రశంసిస్తుంటే ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ ఇషా గుహా (Former England women cricketer Isha Guha) మాత్రం బుమ్రాపై విషం కక్కుతూ కామెంట్స్ చేసింది. ఈ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ బుమ్రాపై ప్రశంసలు జల్లు కురిపించాడు.
అతని వ్యాఖ్యలకు ప్రతిస్పందనంగా ఇసా గుహ బుమ్రాను కొనియాడుతూ నోరు జారింది. ఈ సందర్భంగా ఆమె బుమ్రాను ఉద్దేశించి జాతి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైంది. ఆమె బుమ్రాను చింపాజీతో పోల్చింది. దీంతో నెటిజన్లు గుహపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక క్రికెటర్ అయి ఉంది సాటి క్రికెటర్ ని ఇలా అవమానిస్తావా అంటూ మండిపడ్డారు. అయితే ఆమె చేసిన తప్పుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. ఫాక్స్ టీవీ నిర్వహించిన డిస్కషన్లో గుహ మరియు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సారి చెప్పారు. నేను బుమ్రాను ఆరాధిస్తానని చెప్పింది. అతన్ని పొగిడే క్రమంలో తప్పు పదాన్ని ఉపయోగించానని పేర్కొంది. ఇదిలా ఉంటే గుహ క్షమాపణలకు స్పందించిన రవిశాస్త్రి ఆమెను ధైర్యవంతురాలిగా పేర్కొన్నాడు. కొన్నిసార్లు ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగాలని రవిశాస్త్రి తెలిపారు. ఇషా గుహ 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసింది. ఆమె ఇంగ్లండ్ తరుపున రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్గా రాణించింది. 8 టెస్టులు ఆడి 29 వికెట్లు పడగొట్టగా.. 83 వన్డేల్లో 101 వికెట్లు తీసింది. టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టింది. ప్రస్తుతం అత్యుత్తమ మహిళా వ్యాఖ్యాతలలో ఒకరిగా ఇసా గుహా రాణిస్తున్నారు.
Read Also : Supreme Court : మసీదులో జై శ్రీరామ్ నినాదం ఎలా నేరం? అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు