Telangana : తెలంగాణ గవర్నర్ తమిళిసై, కాసేపట్లో అమిత్ షాతో భేటీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై (Tamilisai) ఢిల్లీకి (Delhi) చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి
- Author : Maheswara Rao Nadella
Date : 22-12-2022 - 12:17 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana) గవర్నర్ తమిళిసై (Tamilisai) ఢిల్లీకి (Delhi) చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో (Amit Shah) పాటు మరికొందరు కేంద్ర మంత్రులను ఆమె కలవనున్నారు. తెలంగాణకు (Telangana) సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో తమిళిసై (Tamilisai) చర్చించే అవకాశం ఉంది. తన పర్యటనల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు, అసెంబ్లీ ఆమోదించిన తర్వాత తన వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం.
Also Read: Modi High-Level Meeting: కరోనా డేంజర్ బెల్స్.. మోడీ హైలెవల్ మీటింగ్!