Balakrishna Helicopter: బాలయ్య హెలికాప్టర్లో సాంకేతిక లోపం
వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ ప్రయాణించే హెలికాప్టర్ (Balakrishna Helicopter) లో సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం 9 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరిన బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ 15 నిమిషాలకే ఒంగోలుకు చేరుకుంది.
- By Gopichand Published Date - 11:50 AM, Sat - 7 January 23

వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ ప్రయాణించే హెలికాప్టర్ (Balakrishna Helicopter) లో సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం 9 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరిన బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ 15 నిమిషాలకే ఒంగోలుకు చేరుకుంది. హెలికాప్టర్ లో బాలకృష్ణ, హీరోయిన్ శృతి హాసన్ కూడా ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కనిపించింది. ప్రస్తుతం ఒంగోలులోనే నందమూరి బాలకృష్ణ ఉన్నారు. ఏటీసీ నుంచి వచ్చే సమాచారం కోసం వేచి చూస్తున్నారు. శుక్రవారం రాత్రి వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ పాల్గొన్నారు.
Also Read: TTD : భక్తులకు టీటీడీ షాక్.. వసతి గృహాల అద్దెలు భారీగా పెంపు
రాత్రికి ఒంగోలులోనే బస చేశారు. కానీ ఉదయం 9 గంటలకు బయలుదేరిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం గుర్తించడంతో అక్కడే నిలిపివేశారు. తిరిగి ఎప్పుడు బయలుదేరతారన్నది మరికాసేపట్లో తెలియనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రానికి బాలయ్యకి జోడీగా శృతి హాసన్ నటించింది. జనవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ అభిమానుల్ని అలరిస్తున్నాయి.