TTD : భక్తులకు టీటీడీ షాక్.. వసతి గృహాల అద్దెలు భారీగా పెంపు
భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. తిరుమలలో వసతి గృహాల అద్దెను టీటీడీ భారీగా పెంచింది. మధ్య తరగతి ప్రజలకు
- By Prasad Published Date - 09:43 AM, Sat - 7 January 23

భక్తులకు టీటీడీ షాక్ ఇచ్చింది. తిరుమలలో వసతి గృహాల అద్దెను టీటీడీ భారీగా పెంచింది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెలను రూ. 500, రూ. 600 నుంచి రూ. 1000కి పెంచారు. అలాగే, ఈ నెల 1 నుంచి నారాయణగిరి రెస్ట్ హౌస్‌లోని 1, 2, 3 గదులను రూ. 150 నుంచి జీఎస్టీతో కలిపి రూ 1,700 పెంచారు. రెస్ట్‌హౌస్ 4లో ఒక్కో గదికి ప్రస్తుతం రూ. 750 వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని 1,700కు పెంచారు. కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ. 2,200 చేశారు. స్పెషల్ టైప్ కాటేజీల్లో గది అద్దెను రూ. 750 నుంచి 2,800కు పెంచారు.