Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి అయన్న.. ఆ రెండు జరగాలని…!
తిరుమల శ్రీవారిని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయన్నపాత్రుడు, ఆయన సతీమణి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా...
- Author : Prasad
Date : 25-11-2022 - 11:14 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమల శ్రీవారిని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయన్నపాత్రుడు, ఆయన సతీమణి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వారిని రెండు కోరికలు కోరుకున్నాని తెలిపారు. దుర్మార్గుడి పాలన నుండి రాష్ట్ర ప్రజలని కాపాడాలని.. పోయిన విజయసాయిరెడ్డి ఫోన్ లో ఢిల్లీ లిక్కర్ స్కాం, విశాఖ భూ దోపిడీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలు దొరికితే దోచిన సొమ్ము అంతా జప్తు అవుతుందని.. తిరిగి మళ్ళీ ప్రజలకే ఆ డబ్బు వస్తుంది కాబట్టి ఆ ఫోన్ తొందరగా దొరకాలని స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు.