TDP : మాచర్ల ఘటనపై జిల్లా కలెక్టర్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ
మాచర్ల ఘటనపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. డిసెంబర్ 16 న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
- By Prasad Published Date - 10:02 AM, Tue - 20 December 22

మాచర్ల ఘటనపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. డిసెంబర్ 16 న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామి రెడ్డి నాయకత్వంలో మాచర్లలో అల్లకల్లోలం సృష్టించారని లేఖలో ప్రస్తావించారు. మాచర్ల ప్రజలకు ప్రాథమిక హక్కులను పునరుద్ధరించే అన్ని ప్రయత్నాలను పోలీసులు తీవ్రంగా నిలిపివేస్తున్నారని తెలిపారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ గా, జిల్లా మేజిస్ట్రేట్ గా తమరు రాజ్యాంగ విధులను నిర్వర్తించాలని కోరుతున్నామని వర్ల రామయ్య లేఖలో పేర్కోన్నారు. జిల్లా మేజిస్ట్రేట్‌గా జిల్లాలోని ప్రతి పౌరునికి రక్షణ కల్పించాల్సిన భాధ్యత కలెక్టర్‌పై ఉందని.. భౌతిక దాడులకు బాధ్యులైన గూండాలు, వారికి సహకరించిన పోలీసు అధికారులపై నిష్పాక్షిక విచారణ నిర్వహించిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆస్తులు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందేలా చూడాలని కలెక్టర్‌ని కోరారు.