TDP : రాష్ట్రంలో రాక్షస పాలన చూస్తున్నాం – మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
రాష్ట్రంలో రాక్షస పాలన చూస్తూనే ఉన్నామని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపించారు...
- Author : Prasad
Date : 08-10-2022 - 3:09 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రంలో రాక్షస పాలన చూస్తూనే ఉన్నామని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన నాటి నుంచి రాష్ట్ర ప్రజానీకాన్ని టాక్స్ ల రూపంలో ఉక్కుపాదంతో తొక్కుతూనే ఉన్నారన్నారు. ఈ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గానికి రక్షణ లేదు దీనిపై ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలలోకి విస్తృతంగా విషయాలను తీసుకువెళ్లే బాధ్యత ప్రతి ఒక్క నాయకుడిపై ఉందన్నారు. బాదుడే..బాదుడే కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకోని వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న పన్నుల భారాన్ని ప్రతి ఒక్క ఓటరు కు తెలియజేయాలని కార్యకర్తలకు తెలిపారు. పార్టీ సభ్యత నమోదు కార్యక్రమముపై ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి నమోదు కార్యక్రమమును విజయవంతం చేయాలన్నారు.