Mahesh Babu : ఏడాదిలో ముగ్గురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన మహేష్ బాబు
టాలీవుడ్ అగ్ర నటుడు మహేష్‌బాబు ఇంట్లో ఈ ఏడాది మొత్తం విషాదంగా ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే (జనవరి 8న)...
- Author : Prasad
Date : 15-11-2022 - 7:04 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ అగ్ర నటుడు మహేష్ బాబు ఇంట్లో ఈ ఏడాది మొత్తం విషాదంగా ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే (జనవరి 8న) సోదరుడు రమేశ్ బాబు చనిపోయాడు. ఆయన చనిపోయిన కొద్ది నెలలకే (సెప్టెంబర్ 28న) తల్లి ఇందిరా దేవి చనిపోయింది. ఇప్పుడు (నవంబర్ 15న) తండ్రి కృష్ణను మహేష్ బాబు కోల్పోయాడు. దీంతో మహేష్ అభిమానులు సైతం విషాదంలో ఉన్నారు. సోషల్ మీడియాలో మహేష్ బాబు తన ఫ్యాన్స్ ఓదారుస్తున్నారు.