SRH Arabic Kuthu: అదుర్స్.. అరబిక్ కుతూ “రైజర్స్”!!
సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఉత్సాహంతో ఊగారు. తమిళ పాట "అరబిక్ కుతూ"కు చిందేశారు. హావభావాలు పలికిస్తూ జోరుగా.. హుషారుగా స్టెప్పులు వేశారు.
- By Hashtag U Published Date - 04:48 PM, Thu - 14 April 22

సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఉత్సాహంతో ఊగారు. తమిళ పాట “అరబిక్ కుతూ”కు చిందేశారు. హావభావాలు పలికిస్తూ జోరుగా.. హుషారుగా స్టెప్పులు వేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోని చెన్నై కు చెందిన ఆటగాడు వాషింగ్టన్ సుందర్ ఈ పాటలో లీడ్ రోల్ చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి “అరబిక్ కుతూ” పాట తమిళ సినిమా బీస్ట్ లోనిది.
ఇందులో తలపతి విజయ్ , పూజా హెగ్డే హీరో హీరోయిన్లు గా నటించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ పాట .. 24 గంటల స్వల్ప వ్యవధిలో ఎక్కువమంది చూసిన, లైక్ చేసిన దక్సినాది పాటగా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఈ పాటకు 20 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. కాగా, “అరబిక్ కుతూ” చిందులతో ఉత్సాహంగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు శుక్రవారం రోజు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది.