Miyapur Murder Case: మియాపూర్ స్పందన హత్య కేసును ఛేదించిన పోలీసులు
Miyapur Murder Case: ఇటీవల మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బండి స్పందన హత్య కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటన కాస్త కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం మియాపూర్‌లోని దీప్తిశ్రీ నగర్ సీబీఆర్ ఎస్టేట్‌లో 3ఏ బ్లాక్‌లో స్పందన హత్యకు గురైంది. స్పందన, ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న విజయకుమార్‌తో ప్రేమించి 2022 ఆగస్టులో వివాహం చేసుకుంది.
- By Kavya Krishna Published Date - 11:26 AM, Sat - 5 October 24

Miyapur Murder Case: నేటి సమాజంలో ప్రేమ అంటే అర్థం చావడం లేక చంపడమే అన్నట్లు మారిపోయింది. ఇటీవల మియాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బండి స్పందన హత్య కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటన కాస్త కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం మియాపూర్‌లోని దీప్తిశ్రీ నగర్ సీబీఆర్ ఎస్టేట్‌లో 3ఏ బ్లాక్‌లో స్పందన హత్యకు గురైంది. స్పందన, ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న విజయకుమార్‌తో ప్రేమించి 2022 ఆగస్టులో వివాహం చేసుకుంది. కానీ వివాహం అయిన తర్వాత ఏడాది తిరగకుండానే, వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. స్పందన తన భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, విజయకుమార్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టు విచారణలో ఉంది.
Haryana Elections 2024 : హర్యానాలో ఓట్ల పండుగ.. ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం
స్పందన తన తల్లి సమ్రతతో కలిసి ఉంటూ, తల్లి సమ్రత ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. నాలుగు రోజుల క్రితం, సమ్రత పాఠశాల నుండి ఇంటికి చేరుకునే సమయానికి స్పందన హత్యకు గురైనది. దీంతో వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఆమె శరీరంపై కత్తి పోట్లు ఉండటంతో ఎవరో హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు, కానీ ఘటనా స్థలంలో ఎటువంటి ఆయుధం లభించలేదు. దర్యాప్తు అనంతరం, సీసీ పుటేజీ, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మనోజ్ అలియాస్ బాలును నిందితుడిగా గుర్తించారు. స్పందనతో క్లాస్‌మేట్ అయిన మనోజ్, ఆమెను ఇష్టపడ్డాడు. కానీ, స్పందన వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో మనోజ్ మనస్తాపానికి గురవ్వడమే కాక, ఆమె భర్తతో విడాకులు తీసుకొని తల్లి దగ్గర ఉండడం చూసి ఆమెపై ప్రేమ ఒత్తిడి పెంచాడు.
స్పందన అతని ప్రేమను తిరస్కరించడం, ఇతర సహచరులతో స్నేహంగా ఉండటాన్ని మనోజ్ జీర్ణించుకోలేకపోయాడు. అనేక గొడవల అనంతరం, పగ పెంచుకున్న మనోజ్, స్పందన ఇంటికి వెళ్లి దాడి చేసి బండరాయితో మోది, స్క్రూడ్రైవర్‌తో తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో స్పందన మృతి చెందింది. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి కేసును ఛేదించారు.
PM-KISAN: నేడు అకౌంట్లోకి డబ్బులు.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే ఏమిటి..?