Haryana Elections 2024 : హర్యానాలో ఓట్ల పండుగ.. ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం
రికార్డు స్థాయిలో పోలింగ్ శాతాన్ని(Haryana Elections 2024) నమోదు చేయాలని హర్యానా రాష్ట్ర ఓటర్లను కోరుతూ ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ఓ సందేశాన్ని విడుదల చేశారు.
- By Pasha Published Date - 09:15 AM, Sat - 5 October 24

Haryana Elections 2024 : హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘట్టం ఇవాళ ఉదయాన్నే మొదలైంది. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ 90 స్థానాలలో పోటీ చేస్తున్న దాదాపు 1000 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20,629 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ దాదాపు 68 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎంత పోలింగ్ నమోదవుతుందో వేచిచూడాలి. ఇక హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ, రెజ్లర్ వినేష్ ఫోగట్, మను భాకర్ తదితరులు ఇప్పటికే ఓటు వేశారు.
Also Read :Rajendra Prasad Daughter: టాలీవుడ్‌లో పెను విషాదం.. రాజేంద్రప్రసాద్ కూతురు కన్నుమూత
ప్రధాని మోడీ, అమిత్‌షా సందేశం..
రికార్డు స్థాయిలో పోలింగ్ శాతాన్ని(Haryana Elections 2024) నమోదు చేయాలని హర్యానా రాష్ట్ర ఓటర్లను కోరుతూ ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ఓ సందేశాన్ని విడుదల చేశారు. ఈ ప్రజాస్వామ్యపు పండుగలో ఉత్సాహంతో పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. తొలిసారి ఓటు వేయబోతున్న యువతకు మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ‘‘వీరభూమి హర్యానా ప్రజలు అవినీతిపరులకు అవకాశం ఇవ్వకూడదు. అవినీతికి తావులేని పాలన అందించే వారికే ఓటు వేయండి. గ్రామగ్రామానికి పాలనను చేరువ చేసే వారినే ఎన్నుకోండి. సంక్షేమాన్ని అందించే వారినే గెలిపించండి’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కోరారు.
Also Read :PM-KISAN: నేడు అకౌంట్లోకి డబ్బులు.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే ఏమిటి..?
ముఖ్య అభ్యర్థులు వీరే..
- హర్యానాలో దశాబ్దం తర్వాత తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుండగా, మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ఆశిస్తోంది.
- ఈసారి పోటీ చేస్తున్న ఇతర పార్టీల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), జననాయక్ జనతా పార్టీ (JJP), ఆజాద్ సమాజ్ పార్టీ (ASP) ఉన్నాయి.
- పొత్తులో భాగంగా భివానీ అసెంబ్లీ స్థానాన్ని సీపీఎంకు కాంగ్రెస్ పార్టీ వదిలేసింది. ః
- ఇక సిర్సా స్థానంలో బీజేపీ పోటీ చేయడం లేదు. అక్కడి నుంచి హర్యానా లోక్ హిత్ పార్టీ అధినేత, సిటింగ్ ఎమ్మెల్యే గోపాల్ కందా పోటీ చేస్తున్నారు.
- ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖుల జాబితాలో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ (బీజేపీ), భూపిందర్ సింగ్ హుడా (కాంగ్రెస్), రెజ్లర్ వినేష్ ఫోగట్ (కాంగ్రెస్), జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా తదితరులు ఉన్నారు.
- బీజేపీ నేత, మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌ను హిసార్‌లోని ఆదంపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
- మహేంద్రగఢ్‌లోని అటెలి స్థానం నుంచి ఆర్టీ రావు పోటీ చేస్తున్నారు. ఈయన కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ కుమారుడు.