Ghulam Nabi Azad: కాంగ్రెస్ నేత గులాం నబీకి కరోనా!
కాంగ్రెస్ లో కొవిడ్ కలకలం రేపుతోంది. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ కాంగ్రెస్ బారిన పడ్డ విషయం తెలిసిందే.
- By Balu J Published Date - 01:16 PM, Tue - 21 June 22

కాంగ్రెస్ లో కొవిడ్ కలకలం రేపుతోంది. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ కాంగ్రెస్ బారిన పడ్డ విషయం తెలిసిందే. గంగారం ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె ఇటీవల కొలుకున్నారు. సోనియా కోలుకున్నారనే వార్త మరువముందే, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు మంగళవారం కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ఆజాద్ ఒక ట్వీట్‌లో, “నేను ఈ రోజు కోవిడ్ పాజిటివ్ పరీక్షించాను. హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాను.” అని వెల్లడించారు. దేశంలో ప్రతిరోజూ నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే కేసులు పెరుగుతున్నా మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది.
I have tested covid positive today and is under home quarantine.
— Ghulam Nabi Azad (@ghulamnazad) June 21, 2022