Independence Day 2023: త్రివర్ణ పతాకం ఎగరేసిన పాక్ మహిళ సీమా
హర్ ఘర్ తిరంగా ప్రచారం కింద, పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ తన ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పాకిస్థాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అంటూ సీమ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఆమె భర్త సచిన్ కూడా ఉన్నారు.
- Author : Praveen Aluthuru
Date : 14-08-2023 - 12:25 IST
Published By : Hashtagu Telugu Desk
Independence Day 2023: హర్ ఘర్ తిరంగా ప్రచారం కింద, పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ తన ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పాకిస్థాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్ అంటూ సీమ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఆమె భర్త సచిన్ కూడా ఉన్నారు.
పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన సీమా హైదర్ అనే మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా వీసా లేకుండా గ్రేటర్ నోయిడాలోని రబూపురా నివాసి సచిన్ ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. అక్రమంగా భారత్‌కు వచ్చినందుకు వారిద్దరినీ పోలీసులు జైలుకు పంపారు. ప్రస్తుతం ఇద్దరూ బెయిల్‌పై విడుదలై రబూపురాలో నివసిస్తున్నారు. ఇక వారి ఆర్ధిక పరిస్థితిపై చలించిన ఓ వ్యాపారి ఉద్యోగం ఆఫర్ చేశాడు. గుజరాత్‌కు చెందిన ఒక పారిశ్రామికవేత్త సీమా ప్రియుడికి ఉద్యోగం ఇచ్చాడు. ఈ ఆఫర్‌లో సీమా, సచిన్‌లకు ప్రతి నెలా 50 వేల వరకు జీతం ఇస్తున్నట్టు ప్రకటించాడు.
सीमा हैदर ने लगाए पाकिस्तान मुर्दाबाद के नारे।#NoidaNews pic.twitter.com/SNUu9Fk9Ig
— Nitin Yadav (@nitinyadav9258) August 14, 2023
Also Read: Mother Deer Sacrifice : బిడ్డ కోసం తల్లి జింక ప్రాణత్యాగం.. ఎమోషనల్ చేస్తున్న వీడియో !