School Bus Overturns: గురజాలలో స్కూల్ బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు
పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ సమీపంలో శుక్రవారం స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా (School Bus Overturns) కొట్టింది. గంగవరం గ్రామ సమీపంలో గుడ్‌న్యూస్ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సుకు బైక్ అడ్డు రావడంతో డ్రైవర్ పక్కకు తప్పించబోయి టైర్ స్లిప్ కావడంతో బోల్తా పడింది.
- By Gopichand Published Date - 10:43 AM, Fri - 6 January 23

పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ సమీపంలో శుక్రవారం స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా (School Bus Overturns) కొట్టింది. గంగవరం గ్రామ సమీపంలో గుడ్‌న్యూస్ అనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సుకు బైక్ అడ్డు రావడంతో డ్రైవర్ పక్కకు తప్పించబోయి టైర్ స్లిప్ కావడంతో బోల్తా పడింది. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
Also Read: Trainee Plane Crash: గుడి గోపురాన్ని ఢీకొన్న ట్రైనీ విమానం.. సీనియర్ పైలట్ మృతి
గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతావారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. విద్యార్థుల స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి విద్యార్థులను బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.