Road Accident : గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
విశాఖపట్నం గాజువాక స్టీల్ ప్లాంట్స్ సెక్టార్ 12లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేశపాత్రునిపాలెం రోడ్డులోని సెక్టార్-12
- Author : Prasad
Date : 10-11-2023 - 7:31 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖపట్నం గాజువాక స్టీల్ ప్లాంట్స్ సెక్టార్ 12లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేశపాత్రునిపాలెం రోడ్డులోని సెక్టార్-12 మలుపు వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. వాసు, సోమేష్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన రాజు అనే మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముగ్గురు స్నేహితులు గంగవరం నుంచి శుభకార్యాల నిమిత్తం పూడిమడకకు వెళ్తున్నారు. సీపీ రవిశంకర్ అయ్యనార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ముగ్గురు యువకుల అకాల మరణంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఇంటికి ఆసరాగా ఉన్న కొడుకులను పోగొట్టుకోవడంతో కుటుంబీకులు రోదిస్తున్నారు.
Also Read: Hyd Police : బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై బాణసంచా పేలిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు