TTD : రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ
TTD : గత ఐదేళ్లుగా అమలులో ఉన్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని, టీటీడీ చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) శ్యామలరావు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా రద్దు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన ముగిసిన తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.
- By Kavya Krishna Published Date - 12:11 PM, Sat - 5 October 24

TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా అమలులో ఉన్న ఈ విధానాన్ని, టీటీడీ చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) శ్యామలరావు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా రద్దు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన ముగిసిన తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన టీటీడీ అధికారులతో శనివారం ఉదయం పద్మావతి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో, ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
Read Also : Rahul Gandhi : కొల్హాపూర్‌లో ఛత్రపతి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న రాహుల్ గాంధీ
తిరుమల పవిత్రతను కాపాడాలని, ఏ పరిస్థితిలోనూ ఆ పవిత్రతకు భంగం కలగకూడదని ఆయన స్పష్టంగా ఆదేశించారు. “భక్తుల సూచనలు , సలహాల ఆధారంగా టీటీడీ సేవలు ఉండాలి” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా, గోవింద నామస్మరణ తప్ప మరే ఇతర శబ్దాలు వినిపించకుండా ఉండాలని, సమాధానానికి ఎక్కడా భంగం కలగకూడదని ఆయన వివరించారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించాల్సిన అవసరం ఉందని, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేకాకుండా, ఆర్భాటం, అనవసర ఖర్చులు నిషేదించాలని, లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యతను మెరుగుపరచాలంటూ టీటీడీ అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ విషయంలో రాజీపడకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇలా, టీటీడీ ఇటీవల తీసుకున్న ఈ నిర్ణయాలతో, తిరుమలలో భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
Read Also : Muizzu Visit India: రేపు భారత్‌కు రానున్న మాల్దీవుల అధ్యక్షుడు.. రాష్ట్రపతి, ప్రధానితో భేటీ..!
ఇదిలా ఉంటే.. సీఎం చంద్ర బాబు నాయుడు శనివారం తిరుమలలోని పాంచజన్యం విశ్రాంతి గృహం వెనుక వైపున ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న అధునాతన, ఫర్నిచర్ వంటగదిని ప్రారంభించారు. సుమారు రూ.13.45కోట్ల వ్యయంతో రూపొందించిన వంటగది 37,245 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో వంట, ఆహార ధాన్యాలు, కూరగాయలు & పాలు – గ్రౌండ్ ఫ్లోర్‌లో, మొదటి అంతస్తులో ఆహార తయారీ, ఆవిరి- LPG ద్వారా నడిచే బాయిలర్‌లతో కూడిన వంట, కార్మికులకు పరిసర వాతావరణాన్ని అందించడానికి ఒక ఎగ్జాస్ట్ సిస్టమ్.