Revanth Reddy: కేసీఆర్ పై రేవంత్ ఫైర్.. షాకింగ్ మ్యాటర్ ఇదే..!
- By HashtagU Desk Published Date - 02:42 PM, Fri - 11 February 22
ఏపీలో కాంగ్రెస్ పార్టీ బతకదని తెలిసి కూడా, నాడు చరిత్రలో నిలిచిపోయేలా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం చిమ్ముతుంటే, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టించుకోలేదని, అయితే కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అభ్యంతరం తెలిపారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య, చీకటి ఒప్పందం కుదిరిందని, అందుకే మోదీ వాఖ్యల పై కేసీఆర్ నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇక చారిత్రక నిర్ణయాలను అవమానపర్చేలా ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారని, చట్ట సభల్లో తెలంగాణను అవమానిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం సైలెంట్‌గా ఉన్నారని, అమర వీరుల త్యాగాల్ని బద్నాం చేస్తూ వ్యాఖ్యలు చేసిన మోదీని నిలదీసే ధైర్యం కేసీఆర్‌కు లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఏవరైనా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారా.. మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ కుటుంబం ఏ పనైనా చేయగలరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కుంటుంబ పాలనతో దళారులుగా మారి దందాలు చేసుకుంటూ బీజేపీకి లొంగిపోయి నరేంద్ర మోదీకి తాబేదార్లుగా మారారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.