HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Minister Seethakka And Konda Surekha Are Going To Meet Kcr But Why

కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

  • Author : Vamsi Chowdary Korata Date : 08-01-2026 - 4:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Erravalli Farmhouse Seethakka, Konda Surekha,
Erravalli Farmhouse Seethakka, Konda Surekha,

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మంత్రులు సీతక్క, కొండా సురేఖ గురువారం (జనవరి 8) మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మేడారం సమ్మక్క, సారక్క మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి.. వనదేవతల పండుగకు రావాలని కోరనున్నట్లు సమాచారం. కాగా, మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది.

  • కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కాంగ్రెస్ మంత్రులు
  • మాజీ ముఖ్యమంత్రితో ప్రత్యేక భేటీ
  • మేడారం మహాజాతరకు రావాలని ఆహ్వానం

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కాంగ్రెస్ మంత్రులు వెళ్లనున్నట్లు సమాచారం. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో గురువారం (జనవరి 8న) మంత్రులు భేటీ కానున్నట్లు సమాచారం. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాజీ సీఎంను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క, సారక్క మహా జాతర ఆహ్వాన పత్రికను అందించి.. వనదేవతల పండుగకు రావాలని కోరనున్నట్లు సమాచారం.

మేడాకం సమ్మక్క, సారక్క మహా జాతర..

కాగా, మేడాకం సమ్మక్క, సారక్క మహా జాతర.. జనవరి 28న ప్రారంభమై జనవరి 31న ముగియనుంది. ఈ పండుగకు ఇప్పటికే సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సంక్రాంతి సెలవులు కూడా ఉండటంతో ఈసారి జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు. అందుకే ఈ వనదేవతల మహా జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. భారీగా నిధులు కేటాయించింది.

మేడారం జాతర జరిగే ప్రాంతంతో పాటు పరిసర గ్రామాల్లో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా భద్రత, రవాణా, తాగునీరు, వైద్య సదుపాయాల ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని.. ఈసారి మేడారం జాతర కన్నుల పండువగా జరగనుందని అధికారులు చెబుతున్నారు.

మేడారం మహా జాతరలో నాలుగు రోజులు ప్రధాన కార్యక్రమాలు జరుగుతాయి. జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులను గద్దెలపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. జనవరి 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెపైకి తీసుకువస్తారు. జనవరి 30న భక్తులు అమ్మవార్లకు మొక్కులు (బంగారం) సమర్పించుకుంటారు. ఇక చివరి రోజు అయిన జనవరి 31న దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.

మరోవైపు, ఈసారి జతరకు సమ్మక్క, సారక్క గద్దెలు కొత్త హంగులతో ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో సమ్మక్క-సారక్క గద్దెలను నిర్మిస్తున్నారు. గద్దెల ఎత్తును పెంచడంతో పాటు.. చుట్టూ పాలరాతి గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీని కూజా తట్టుకునేలా గద్దెల ప్రాంగణాన్ని 180 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు విస్తరిస్తున్నారు. కాగా, జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న మేడారం వెళ్లనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • congress party
  • Erravalli Farmhouse
  • kcr
  • Konda Surekha
  • Minister Seethakka
  • telangana politcs

Related News

Green signal for Musi rejuvenation; government approves ₹7,000 crore project.

Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరాల సరసన నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ మెగా ప్రాజెక్టు పరిధిలోని ప్రాధాన్యతా ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూ.7,345.12 కోట్ల భారీ బడ్జెట్‌కు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ త

  • Kalvakuntla Kavitha lashes out at KTR.

    kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Delhi High Court deals a blow to Kavitha.

    kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

  • Alcohol: మందు కొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd