Retired IAS Arun Goyal: ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అరుణ్ గోయల్..!
భారత ఎన్నికల సంఘం 26వ ప్రధాన కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ శనివారం నియమితులయ్యారు.
- Author : Gopichand
Date : 19-11-2022 - 8:36 IST
Published By : Hashtagu Telugu Desk
భారత ఎన్నికల సంఘం 26వ ప్రధాన కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. అరుణ్ గోయల్ ఇటీవలే ఐఏఎస్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. గతంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. గోయల్ నియామకాన్ని ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.
భారత ఎన్నికల సంఘం 26వ ప్రధాన కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అరుణ్ గోయల్ నియమితులయ్యారు. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. అయితే ఆయన నియామక తేదీ ఇంకా ఖరారు కాలేదు. వచ్చే నెలలోనే గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌గా ఆయన నియామకాన్ని ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 వరకు గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 8న ప్రకటించనున్నారు.
అరుణ్ గోయల్ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కావడం గమనార్హం. గోయల్ 60 ఏళ్లు నిండిన తర్వాత డిసెంబర్ 31, 2022న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ఆయన నవంబర్ 18న అంటే నిన్ననే తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశాడు. గోయల్ 1985 బ్యాచ్ పంజాబ్ కేడర్ అధికారి. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేతో పాటు ఆయన ఎన్నికల కమిషన్‌లో భాగమవుతారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుశీల్ చంద్ర మేలో పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు.