Remand Report: చంద్రబాబు రిమాండ్ రిపోర్టు తిరస్కరించండి.. కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు..!
రిమాండ్ రిపోర్ట్ తిరస్కరణ (Remand Report)పై వాదనలకు జడ్జి అవకాశం కల్పించారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై ఆయన తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లోద్రా వాదనలు వినిపిస్తున్నారు.
- By Gopichand Published Date - 08:59 AM, Sun - 10 September 23

Remand Report: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును నంద్యాలలో శనివారం తెల్లవారుజామున సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు తరపున వాదనలు పినిపించడానికి ముగ్గురిని కోరగా ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చిన జడ్జి హిమబిందు. సిద్ధార్థ లూథ్రా, పోసాని వెంకటేశ్వర రావు పేర్లు చెప్పగా అనుమతి ఇచ్చిన జడ్జి. ఇంతమంది లాయర్ లు ఇక్కడ ఎందుకు వున్నారు అని అడిగిన జడ్జి హిమ బిందు. స్వచ్ఛందంగా మీరే వెళ్ళండి.. 15 మంది కి మాత్రమే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పిన జడ్జి హిమబిందు.
ప్రస్తుతం ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్ వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఓపెన్ కోర్టులో వాదనలు వినేందుకు ఏసీబీ న్యాయమూర్తి అంగీకరించారు. చంద్రబాబు అరెస్ట్ లో 409 సెక్షన్ కింద వాదనలు జరుగుతున్నాయి. అసలు ఈ సెక్షన్ ఈ కేసులో పెట్టడం సబబు కాదని లోద్రా వాదనలు. 409 పెట్టాలి అంటే ముందు సరైన సాక్ష్యం చూపాలని లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.
Also Read: Chandrababu – Remand Report : చంద్రబాబుపై సీఐడీ రిమాండ్ రిపోర్టులోని అంశాలివీ..
చంద్రబాబు రిమాండ్ రిపోర్టు తిరస్కరించండి
రిమాండ్ రిపోర్ట్ తిరస్కరణ (Remand Report)పై వాదనలకు జడ్జి అవకాశం కల్పించారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టుపై ఆయన తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ‘చంద్రబాబుపై సెక్షన్ 409 పెట్టడం సరికాదు. 409 సెక్షన్ పెట్టాలంటే సరైన సాక్ష్యాలు చూపించాలి. చంద్రబాబు రిమాండ్ రిపోర్టు తిరస్కరించండి’ అని లూథ్రా వాదించారు.
కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు
స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు సంబంధించి తన వాదనలను చంద్రబాబు స్వయంగా విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు వినిపిస్తున్నారు. తన వాదనలు వినేందుకు అనుమతించాలని బాబు విజ్ఞప్తికి న్యాయమూర్తి కూడా అంగీకరించారు. ‘ఈ స్కాంతో నాకు సంబంధం లేదు. నా అరెస్ట్ అక్రమం. రాజకీయ కక్షతోనే ఇలా కేసులో ఇరికించారు’ అని బాబు కోర్టులో వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్‌కు కూడా వచ్చారు.