Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం
పాకిస్థాన్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో.. ఇస్లామాబాద్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇస్లామాబాద్‌తో పాటు పంజాబ్‌లోని ఇతర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది.
- By Gopichand Published Date - 02:41 PM, Sun - 29 January 23

పాకిస్థాన్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో.. ఇస్లామాబాద్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఇస్లామాబాద్‌తో పాటు పంజాబ్‌లోని ఇతర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ (NSMC) ప్రకారం.. భూకంపం కేంద్రం ఆఫ్ఘనిస్తాన్ సమీపంలో ఉంది. దీని లోతు 150 కి.మీ, రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో ఉంది.
NSMC ప్రకారం.. రావల్పిండి, ముర్రీ, ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్‌లోని అనేక ఇతర ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే భూకంపం సంభవించిన వెంటనే ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ నెలలో పాకిస్థాన్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి.
Also Read: Minister Injured In Firing: బ్రేకింగ్.. మంత్రిపై దుండగుల కాల్పులు
జనవరి మొదటి వారంలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో వచ్చిన భూకంపం కారణంగా భూమి కంపించింది. ఈ సందర్భంగా రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత నమోదైంది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని NSMC తెలిపింది. అదే సమయంలో భూకంపం కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో ఉంది. దాని లోతు 173 కి.మీ. గిల్గిట్, పాక్‌పట్టాన్, లక్కీ మార్వాట్, నౌషేరా, స్వాత్‌తో సహా పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు ఎన్‌ఎస్‌ఎంసి సమాచారం అందించింది.
పాకిస్థాన్‌లోని పెషావర్, చిత్రాల్, ఖైబర్ జిల్లా, ట్యాంక్, బజౌర్, మర్దాన్, మూరి, మన్సెహ్రా, ముల్తాన్, కోట్లి తదితర ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఒక్క పాకిస్థాన్‌లోనే కాదు, భారత్‌తో సహా ఇతర పొరుగు దేశాలలో కూడా భూమి కంపించింది. NSMC ప్రకారం.. పాకిస్తాన్‌లో భూకంపం సాధారణ విషయం. ఈ భూకంపానికి ఒక రోజు ముందు, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. అదే సమయంలో 2005 సంవత్సరంలో పాకిస్తాన్‌లో అత్యంత ప్రమాదకరమైన భూకంపం వచ్చింది. ఈ భూకంపం వల్ల వేలాది మంది చనిపోయారు.