PM Modi Lands In Delhi: సౌదీ అరేబియా నుంచి వచ్చిన ప్రధాని మోదీ.. వారితో హైలెవెల్ మీటింగ్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన వెంటనే పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి పరిస్థితిని సమీక్షించారు.
- By Gopichand Published Date - 08:52 AM, Wed - 23 April 25

PM Modi Lands In Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi Lands In Delhi) సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన వెంటనే పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి పరిస్థితిని సమీక్షించారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయన జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోవల్, విదేశాంగ మంత్రి (EAM) ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి (FS)తో అత్యవసర సమావేశం నిర్వహించి, పూర్తి పరిస్థితి గురించి సమాచారం తీసుకున్నారు.
ప్రధానమంత్రి మోదీ ఈ దాడిని తీవ్రంగా పరిగణించి, అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి వెంటనే అన్ని విధాలుగా సహాయం అందించాలని ఆదేశించారు. ఈ ఉగ్రవాద దాడి కారణంగా ప్రధానమంత్రి మోదీ మంగళవారం సౌదీ అరేబియాకు తన రెండు రోజుల సందర్శనను మధ్యలోనే ముగించి స్వదేశానికి తిరిగి వచ్చే నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి మోదీ సౌదీ అరేబియా ఆతిథ్యం ఇచ్చిన అధికారిక విందులో పాల్గొనలేదు. తన సందర్శనను మధ్యలోనే ముగించి దేశానికి తిరిగి వచ్చే నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Curd: పెరుగుతో పాటు ఈ పండ్లు కలిపి తింటున్నారా.. అయితే ఈ విషయాలు మీ కోసమే!
ప్రధానమంత్రి మోదీ ఉగ్రవాద దాడిని ఖండించారు
ఇంతకు ముందు ప్రధానమంత్రి మోదీ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని అన్నారు. ఆయన ‘ఎక్స్’లో ఇలా పేర్కొన్నారు. “నేను జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి పట్ల నేను సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రభావితమైన వారికి అన్ని విధాల సహాయం అందించబడుతోంది.” అని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు. “ఈ దుర్మార్గపు చర్య వెనుక ఉన్న వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టబడతాం… వారిని వదిలిపెట్టబోము. వారి దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మా సంకల్పం అచంచలమైనది, ఇది మరింత బలపడుతుంది.” అని పేర్కొన్నారు.