PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుదల తేదీ ఖరారు
భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
- Author : Latha Suma
Date : 19-02-2025 - 5:34 IST
Published By : Hashtagu Telugu Desk
PM Kisan : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం-కిసాన్ పథకం 19వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 24న రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగిఉండాలి.
Read Also: India’s Smallest Passenger Train : కేవలం 9 కి.మీ నడిచే ట్రైన్ ఉందని మీకు తెలుసా..?
బీహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. ఈ-కేవైసీ చేసి ఉండాలి. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్ తెలుసుకోవడానికి లేదా పీఎం కిసాన్ జాబితాలో పేరు ఉందో లేదో చూడడానికి పీఎం కిసాన్ ప్రభుత్వ వెబ్ సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేసుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్ లేదా ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి వివరాలు పొందవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంటుంది. పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో, లేదో చూడాలన్నా https://pmkisan.gov.in/లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ దరఖాస్తు విధానం
Step1 : పీఎం కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లో ‘ఫార్మర్ కార్నర్’ పై క్లిక్ చేయండి.
Step2 : ‘New Farmer Registration’పై క్లిక్ చేసి ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
Step3 : అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి Yes option పై క్లిక్ చేయండి
Step4 : పీఎం కిసాన్ దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసి సమాచారాన్ని సేవ్ చేయండి. దానిని ప్రింటౌట్ కూడా తీసుకోండి.
Read Also: Rekha Gupta: ఢిల్లీ సీఎంగా మహిళ.. ఎవరీ రేఖా గుప్తా?