HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Donald Trump Again Calls For Stopping The Indo Pak War

మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

ఏప్రిల్ 22, 2025న పాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • Author : Gopi Date : 19-02-2026 - 9:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Donald Trump
Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’ సమావేశంలో ఆయన ఈ వాదనను వినిపించారు. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడుతూ.. ఒకవేళ మీరు ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే రెండు దేశాలతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోనని చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాకుండా రెండు దేశాలపై 200 శాతం టారిఫ్ విధిస్తానని బెదిరించినట్లు కూడా ఆయన తెలిపారు.

డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ప్రెసిడెంట్ ట్రంప్ మాకు, భారత్‌కు మధ్య యుద్ధాన్ని ఆపి 2.5 కోట్ల మంది ప్రాణాలను కాపాడారని పాకిస్థాన్ ప్రధాని మా చీఫ్ ఆఫ్ స్టాఫ్ వద్ద అంగీకరించారు. అప్పట్లో యుద్ధం ముదురుతోంది. విమానాలను కూల్చివేస్తున్నారు. ఆ సమయంలో నేను ఇరు దేశాల నేతలతో ఫోన్‌లో మాట్లాడాను. నాకు ప్రధాని మోదీ చాలా బాగా తెలుసు అందుకే ఆయనకు ఫోన్ చేశాను అని వివరించారు.

ట్రంప్ ఇంకా ఇలా అన్నారు. వినండి, మీరు ఈ విషయాన్ని తేల్చకపోతే నేను మీతో ట్రేడ్ డీల్ చేయను అని మోదీకి చెప్పాను. అకస్మాత్తుగా అంతా సర్దుమణిగింది. మీరు గనుక యుద్ధం చేస్తే రెండు దేశాల మీద 200 శాతం టారిఫ్ విధిస్తానని హెచ్చరించాను. నిజానికి రెండు దేశాలూ పోరాడాలని అనుకున్నాయి. కానీ డబ్బు విషయం వచ్చేసరికి.. తమకు యుద్ధం వద్దని వారు వెనక్కి తగ్గారని పేర్కొన్నారు.

Also Read: స్పైస్‌జెట్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం!

#WATCH | At the Board of Peace Event, US President Donald Trump says, "…He (Pakistani PM) said in front of our Chief of Staff that President Trump saved 25 million lives when he stopped the war between us and India…That war was raging. Planes were being shot down. And I got… pic.twitter.com/pm5eT7xjz3

— ANI (@ANI) February 19, 2026

భారత్- ఇతర దేశాల స్పందన

డొనాల్డ్ ట్రంప్ తాను భారత్-పాక్ యుద్ధాన్ని ఆపానని గతంలోనూ పలుమార్లు చెప్పుకున్నారు. అయితే భారత్ ఎప్పుడూ ఈ వాదనలను తోసిపుచ్చుతూనే ఉంది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో ఏ మూడవ శక్తి ప్రమేయం లేదని భారత్ స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన వాదనను కొనసాగిస్తున్నారు. అమెరికాతో పాటు చైనా కూడా మే 2025లో భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల సమయంలో తామే ‘మధ్యవర్తిత్వం’ వహించామని క్లెయిమ్ చేసుకుంది.

ఏప్రిల్ 22, 2025న పాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిచర్యగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి పాకిస్థాన్‌పై విరుచుకుపడింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన పలు సైనిక స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఆ సమయంలోనే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • Ind-PAK War
  • pakistan
  • pm modi
  • USA
  • world news

Related News

Looming deadline... Trump issues stern warning to Iran.

Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్‌కు అమెరికా 24 గంటల గడువుతో కూడిన తుది హెచ్చరిక (డెడ్లైన్) విధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సముద్ర మార్గాల్లో ప్రయాణించే అంతర్జాతీయ నౌకలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, తాము తప్పు చేశామని ఇరాన్ బహిరంగంగా అంగీకరించాలని అమెరికా డిమాండ్ చేసినట్లు సమాచారం. ప్రపంచ దేశాల వాణిజ్యానికి అత్యంత కీలకమ

  • They are trying to assassinate me... Trump's shocking comments.

    Donald Trump: నన్ను హత్య చేయాలని చూస్తోంది.. ట్రంప్‌ షాకింగ్ కామెంట్స్

  • Attack on Chabahar port after Trump's warning

    US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

    Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

  • Tragic accident in the US: Young woman from NTR district dies.

    Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd