Rahul Gandhi: రాహుల్ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణపై సుప్రీంకోర్టులో పిటిషన్
దేశవ్యాప్తంగా ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది ఎన్నికల తీరు మారే అవకాశముంది. బీజేపీ ప్రభుత్వం తీసుకురానున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్
- By Praveen Aluthuru Published Date - 05:51 PM, Tue - 5 September 23

Rahul Gandhi: దేశవ్యాప్తంగా ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది ఎన్నికల తీరు మారే అవకాశముంది. బీజేపీ ప్రభుత్వం తీసుకురానున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ చట్టం ఆమోదం పొందితే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఏకకాలంలో జరుగనున్నాయి. దీంతో వచ్చే ఎన్నికలు మరింత రసవత్తరంగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై బీజేపీ కేసుల మీద కేసులు మోపుతోంది.
మోడీ ఇంటిపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ వెంటాడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్నో న్యాయవాది అశోక్ పాండే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ కేసులో దోషి నిర్దోషిగా బయటపడే వరకు అతని సభ్యత్వాన్ని పునరుద్ధరించలేమని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది.
Also Read: Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు నుంచి ఏక్ దమ్ ఏక్ దమ్ లిరికల్ సాంగ్ రిలీజ్