Pawan Kalyan : వైసీపీ రహిత ఏపీ లక్ష్యంగా బీజేపీ, జనసేన పనిచేస్తాయి – జనసేనాని పవన్
వైఎస్‌ఆర్‌సీపీ రహిత ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా జనసేన, బీజేపీ ఉమ్మడి లక్ష్యంతో పాటుపడతాయని జనసేనాని పవన్
- By Prasad Published Date - 10:49 PM, Wed - 5 April 23

వైఎస్‌ఆర్‌సీపీ రహిత ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా జనసేన, బీజేపీ ఉమ్మడి లక్ష్యంతో పాటుపడతాయని జనసేనాని పవన్ తెలిపారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం సినీనటుడు, రాజకీయ నాయకుడు పవన్‌కల్యాణ్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. దక్షిణాది రాష్ట్రంలో అధికారంలో ఉన్న YSRCPని ఎలా గద్దె దింపాలనే దానిపై బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాతో తాను చర్చలు జరిపినట్లు కళ్యాణ్ పేర్కొన్నారు. బీజేపీ చీఫ్‌తో మంగళవారం రాత్రి 45 నిమిషాల పాటు జరిగిన మేధోమథన సమావేశానికి పవన్ కళ్యాణ్‌తో పాటు, నాదెండ్ల మనోహర్, బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జ్ వీ మురళీధరన్ కూడా హాజరయ్యారు.
వైఎస్‌ఆర్‌సీపీ నేతల అవినీతి, దౌర్జన్యాలపై తాము చర్చించామని తెలిపారు. అయితే ఈ సమావేశంలో రాజకీయ పొత్తులు చర్చకు రాలేదని పవన్ తెలిపారు. APలో రాజకీయ అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలనే దానిపై కొంత వ్యూహం రచిస్తున్నామని తెలిపారు.