Pak Drone: పంజాబ్‌లో డ్రోన్ కలకలం.. కోట్లు విలువ చేసే హెరాయిన్ స్వాధీనం
పంజాబ్‌లో మరోసారి డ్రోన్ (Drone) కలకలం రేపుతోంది. పహారా కాస్తున్న జవాన్లకు డ్రోన్ శబ్దం వినిపించడంతో అలర్ట్ అయ్యారు. పాకిస్థాన్ వైపు నుంచి భారత్‌లోకి డ్రోన్ రావడాన్ని గమణించిన భారత్ జవాన్లు దాన్ని కూల్చారు.
- Author : Gopichand
Date : 10-02-2023 - 10:51 IST
Published By : Hashtagu Telugu Desk
పంజాబ్‌లో మరోసారి డ్రోన్ (Drone) కలకలం రేపుతోంది. పహారా కాస్తున్న జవాన్లకు డ్రోన్ శబ్దం వినిపించడంతో అలర్ట్ అయ్యారు. పాకిస్థాన్ వైపు నుంచి భారత్‌లోకి డ్రోన్ రావడాన్ని గమణించిన భారత్ జవాన్లు దాన్ని కూల్చారు. దాని నుంచి దాదాపు 3 కిలోల హెరాయిన్, చైనాలో తయారైన తుపాకీ, బుల్లెట్లు, మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని చెప్పారు. ఫిబ్రవరి 9, 10వ తేదీ రాత్రి పాక్ డ్రోన్ల ద్వారా భారత్‌లోకి చొరబడే ప్రయత్నం జరిగింది. దీని తరువాత BSF జవాన్లు ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో సుమారు 3 కిలోల హెరాయిన్, 1 చైనా తయారు చేసిన పిస్టల్, కాట్రిడ్జ్‌లు, ఒక మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారాన్ని బీఎస్ఎఫ్ వెల్లడించింది.
ఫిబ్రవరి 9, 10 మధ్య రాత్రి పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో పాకిస్తాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మోహరించిన BSF దళాలు పాకిస్తాన్ వైపు నుండి భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న డ్రోన్‌ను గుర్తించినట్లు BSF ప్రతినిధి తెలిపారు. దీని తరువాత సైనికులు యాంటీ డ్రోన్ చర్యలు చేపట్టి దానిపై కాల్పులు జరిపారు.
Also Read: Gold And Silver Price Today: పెరుగుతున్న ధరలు.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే..!
తరువాత BSF సిబ్బంది జరిపిన శోధనలో పాకిస్తాన్ డ్రోన్ ద్వారా పడిపోయిన సరుకుతో కూడిన ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఒక అధికారి తెలిపారు. ప్యాకెట్‌లో సుమారు 3 కిలోల హెరాయిన్, 1 చైనా మేడ్ పిస్టల్, క్యాట్రిడ్జ్‌లు, మ్యాగజైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ ఖరీదు కోట్లలో ఉంటుందని అంచనా. పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ నుంచి మాదక ద్రవ్యాలు, ఆయుధాలు తరచూ తరలిస్తుండటం గమనార్హం. ఇందుకోసం బీఎస్ఎఫ్ యాంటీ డ్రోన్ వ్యవస్థను ఉపయోగించడమే కాకుండా స్మగ్లర్లను పట్టుకునేందుకు స్థానిక పోలీసుల సాయం కూడా తీసుకుంటోంది.