KTR : కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది
KTR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ రగిలింది. ప్రాజెక్టును రాజకీయ లాభనష్టాల కోసం వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విషప్రచారం చేస్తోందని, ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి ఇప్పుడు శంఖుస్థాపన పేరుతో ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
- By Kavya Krishna Published Date - 02:38 PM, Mon - 8 September 25

KTR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ రగిలింది. ప్రాజెక్టును రాజకీయ లాభనష్టాల కోసం వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విషప్రచారం చేస్తోందని, ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి ఇప్పుడు శంఖుస్థాపన పేరుతో ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్ వ్యాఖ్యానిస్తూ, “కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కక్ష కట్టింది. ఎన్నికలకు ముందే ‘కాళేశ్వరం కూలేశ్వరం’ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తెస్తున్నామని గొప్పలు చెబుతున్నారు. శంఖుస్థాపన చేయాలంటే మల్లన్నసాగర్ వద్ద చేయాలి. మొహం చెల్లక గండిపేట వద్ద డ్రామాలు చేస్తున్నారు. తల దగ్గర చేయాల్సిన శంఖుస్థాపనను తోక దగ్గర చేస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.
Bihar : బిహార్ ఎన్నికల..నోటిఫికేషన్ కంటే ముందే హెలికాప్టర్లకు హవా!
అలాగే ఆయన, “మల్లన్నసాగర్ నుంచే ప్రస్తుతం హైదరాబాద్‌కు మంచి నీళ్లు వస్తున్నాయి. ఇదే కాళేశ్వరం ఫలితం. ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 240 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. అయినా ఈ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారు. కేవలం కమిషన్ పేరుతో టైంపాస్ చేశారు. ఈ కారణంగా సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే” అని డిమాండ్ చేశారు.
సీబీఐ విచారణపై మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ ఎప్పుడూ సీబీఐని విమర్శిస్తారు. అదే సీబీఐకి కాళేశ్వరం కేసును రేవంత్ అప్పగించడం హాస్యాస్పదం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.94 వేల కోట్లు ఖర్చయింది. మరి లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? అని సీఎం సమాధానం చెప్పాలి” అన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం ఉపయోగిస్తున్న నీళ్లు కూడా మల్లన్నసాగర నుంచే వస్తున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. “ఎల్లకాలం మోసం చేయడం సాధ్యం కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం డ్రామాలు ఆపి వాస్తవాలను అంగీకరించాలి” అని హెచ్చరించారు.
Online Food Order : GST దెబ్బ.. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేవారి జేబులకు చిల్లు