Owaisi Campaign: ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసిన ఓవైసీ
హైదరాబాద్ లో ఎంపీ అసదుద్దీన్ ఎంఐఎం ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ, మేనల్లుడు డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీ ఆదివారం ఓల్డ్ సిటీ అంతటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 05-11-2023 - 2:27 IST
Published By : Hashtagu Telugu Desk
Owaisi Campaign: హైదరాబాద్ లో ఎంపీ అసదుద్దీన్ ఎంఐఎం ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ, మేనల్లుడు డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీ ఆదివారం ఓల్డ్ సిటీ అంతటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో నూరుద్దీన్ ఒవైసీ తన తండ్రి అక్బరుద్దీన్ ఒవైసీ వెనుక నడిచారు. రిసాలా గ్రౌండ్, నాయక్ నగర్, బుడగజంగం, వీరముస్తీ-సంగం, జంగ్‌మెట్ మార్కెట్, పీర్జీ మసీదు ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.
నూరుద్దీన్ ఒవైసీ చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని సమాచారం. నాలుగు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గం ఎంఐఎం ప్రాతినిథ్యంలోనే ఉంది. నూరుద్దీన్ ఒవైసీ తాత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, మామ అసదుద్దీన్ ఒవైసీ ఇద్దరూ తమ రాజకీయ జీవితాన్ని చార్మినార్ నుంచే ప్రారంభించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో నూరుద్దీన్ ఒవైసీని పోటీకి దింపాలని అనుకున్నారు. అయితే అప్పుడు తన వయసు18 సంవత్సరాల కంటే తక్కువ కావడంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండాపోయింది. మరియు MBBS చదువుతున్నాడు.
Also Read: Nuclear Bomb On Gaza : గాజాపై అణుబాంబు.. ఇజ్రాయెల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు