Israel Hamas war: గాజాకు విద్యుత్, ఇంధనం, నీళ్లు కట్ : ఇజ్రాయెల్ మంత్రి
ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరుగుతున్న భీకర పోరాటంలో అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 12-10-2023 - 2:43 IST
Published By : Hashtagu Telugu Desk
Israel Hamas war: ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరుగుతున్న భీకర పోరాటంలో అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలను ఎంతోమందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకుని హింసిస్తున్నారు. వాళ్ళని గాజాలో నిర్బంధించారు. హమాస్ దాడిని ప్రతిఘటిస్తున్న ఇజ్రాయెల్ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. హమాస్ మిలిటెంట్ బందీలుగా చేసుకున్న తమ పోరులని విడిపించే వరకు గాజాకు విద్యుత్, ఇంధనం, నీరు సరఫరా చేయబోమని ఇజ్రాయెల్ ఇంధన మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ గురువారం చెప్పారు.
ఇంధన కొరత కారణంగా గాజాలోని ఏకైక పవర్ స్టేషన్ మూతబడింది. ఫలితంగా ఆసుపత్రులతో సహా హమాస్-నియంత్రిత ఎన్‌క్లేవ్‌లోని ప్రాంతాలు జనరేటర్‌లపై ఆధారపడుతున్నాయి. తర్వాత ఈ జనరేటర్లకు ఇంధన సరఫరా అవసరం పడుతుంది. ఆసుపత్రులు కరెంటుని కోల్పోవడంతో రోగులు మరణించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ గురువారం హెచ్చరించింది. ఇంక్యుబేటర్లలో నవజాత శిశువులు మరియు వృద్ధ రోగులను ఆక్సిజన్‌లో ఉంచే ప్రమాదం ఉంది. కిడ్నీ డయాలసిస్ ఆగిపోతుంది మరియు ఎక్స్-రేలు తీసుకోలేరు.
Also Read: Telangana: గిరిజనులకు 10% రిజర్వేషన్లు కలిపిస్తాం..