NEET UG 2025: నీట్ 2025 పరీక్షలపై కీలక నిర్ణయం.. పెన్, పేపర్ పద్ధతిలో!
ఎన్‌ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ నీట్ యుజి 2025 పరీక్షను ఒక రోజు, ఒక షిఫ్ట్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్ష పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించబనున్నట్లు పేర్కొన్నారు.
- By Gopichand Published Date - 07:16 PM, Thu - 16 January 25

NEET UG 2025: నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక సమాచారాన్ని విడుదల చేసింది. ఈ సమాచారం నీట్ 2025 (NEET UG 2025) నిర్వహణకు సంబంధించినది. నోటీసు ప్రకారం.. నీట్ 2025 పరీక్ష ఒకే రోజు, ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష పెన్, పేపర్ మోడ్ అంటే OMR ఆధారితంగా ఉంటుంది. అధికారులు జారీ చేసిన నోటీసులో.. ఎన్‌ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ నీట్ యుజి 2025 పరీక్షను ఒక రోజు, ఒక షిఫ్ట్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్ష పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించబనున్నట్లు పేర్కొన్నారు.
NEET UG 2025 రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
NEET UG 2025 రిజిస్ట్రేషన్ తేదీ ఇంకా విడుదల కాలేదు. గత సంవత్సరం ప్రకారం.. NEET UG 2025 పరీక్ష నమోదు ఫారమ్‌ను మార్చి 2025 లేదా ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయవచ్చని సమచారం. కానీ అధికారులు ఇంకా ఎటువంటి నిర్ధారణ చేయలేదు. మునుపటి నోటీసులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభించబడుతుందని NTA పేర్కొంది. అయితే రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను విడుదల చేసే తేదీని పేర్కొనలేదు. NEET UG 2025 కోసం సిద్ధమవుతున్న ఏ విద్యార్థి లేదా అభ్యర్థి అయినా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ల కోసం NTA అధికారిక వెబ్‌సైట్ nta.ac.inని గమనించాలని సూచించారు.
Also Read: India Batting Coach: టీమిండియాకు కొత్త బ్యాటింగ్ కోచ్.. ఎవరంటే?
NEET UG స్కోర్ దేనికి ఉపయోగపడుతుంది?
NEET UG 2025 పరీక్ష స్కోర్‌తో ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ BAMS, BUMS, BSMS వంటి UG కోర్సులలో అడ్మిషన్ తీసుకోవచ్చు. నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి క్రింద BHMS కోర్సులో ప్రవేశానికి NEET UG స్కోర్ అవసరం. ముఖ్యంగా 2025 కోసం సాయుధ దళాల వైద్య సేవల ఆసుపత్రులలో B.Sc. నర్సింగ్ కోర్సులో ప్రవేశం కోరుకునే MNS (మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్) అభ్యర్థులు NEET UGలో అర్హత సాధించాల్సి ఉంటుంది. NTA విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. మెడికల్ ప్రవేశ పరీక్ష మార్కులు నాలుగు సంవత్సరాల B.Sc కోసం ఉపయోగించబడతాయి. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను నర్సింగ్ కోర్సుకు ఎంపిక చేస్తారు.