Draupadi Murmu : రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిముర్ము హైదరాబాద్ పర్యటన వాయిదా.. కారణం ఇదే..?
హైదరాబాద్: రేపు( జులై 12న) హైదరాబాద్ రావాల్సిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తన పర్యటనను వాయిదా వేసుకున్నారు
- Author : Prasad
Date : 11-07-2022 - 10:25 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్: రేపు( జులై 12న) హైదరాబాద్ రావాల్సిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. భారీ వర్ష సూచన కారణంగా ఆమె పర్యటన వాయిదా పడింది. ద్రౌపది ముర్ము జూలై 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచన దృష్ట్యా షెడ్యూల్ చేయబడిన పర్యటన వాయిదా పడిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా జూలై 2న హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపప్ది ముర్ము ప్రస్తుతం ప్రచారంలోనే ఉన్నారు. అయితే బెంగళూరు నుండి హైదరాబాద్‌కి రావలసి ఉంది. ఈ సమయంలో భారీ వర్షాల కారణంగా పర్యటనను వాయిదావేయాల్సి వచ్చింది. రాజ్‌భవన్ సమీపంలోని ఓ హోటల్‌లో బీజేపీ ప్రజాప్రతినిధులతో సంభాషించడంతోపాటు హైదరాబాద్‌లో భారీ స్వాగతాన్ని రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేసింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనలో భారీ స్వాగత ఏర్పాట్లు టీఆర్ఎస్ చేయడంతో ఇటు బీజేపీకూడా తమ అభ్యర్థి ముర్ముకి కూడా అదే స్థాయిలో ఏర్పాట్లు చేయాలని భావించింది.