HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Nara Bhuvaneshwari And Brahmin In Public

AP : ప్రజాక్షేత్రంలోకి నారా బ్రాహ్మణి..భువనేశ్వరి..?

ముఖ్యంగా మహిళల్లో సానుభూతి పవనాలు వీస్తే ఫలితాలు పూర్తి స్థాయిలో ఏకపక్షమవుతాయన్న అంచనాలు

  • Author : Sudheer Date : 10-09-2023 - 10:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Bhuvaneshwari And Brahmin In Public
Nara Bhuvaneshwari And Brahmin In Public

నిన్నటి నుండి యావత్ ప్రజానీకం అంత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu arrest) గురించే మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు కు సంబంధం లేని కేసులో ఆయన్ను ఇరికించడం..విచారణ పేరుతో CID దాదాపుగా 30 గంటలగా ఇబ్బందికి గురిచేస్తుండడం ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. కనీసం కాసేపైనా ఆయన్ను రెస్ట్ తీసుకోకుండా..అటు ఇటు తిప్పుతూ..నరకం చూపిస్తున్నారు వారంతా వాపోతున్నారు. సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే..అధికార పార్టీ..ప్రతిపక్ష పార్టీల నేతలఫై కేసులు పెట్టడం..వారిని అరెస్ట్ చేయించడం చేస్తుంది. చంద్రబాబు విషయంలో మాత్రం జగన్ సర్కార్ కక్ష్య సాధింపు చర్య చేస్తుంది. ఆయనకు అసలు సంబంధం లేని..ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు కూడా లేని కేసులో ఆయన్ను అరెస్ట్ చేయించింది. అంతే కాదు ఈ కేసులో నారా లోకేష్ ను కూడా చేర్చి జైలు పంపించాలని చూస్తుంది. ప్రభుత్వం ఎన్ని కక్ష్య సాధింపు చర్యలు చేపట్టిన చివరకు ధర్మమే గెలుస్తుందని చంద్రబాబు ధీమా గా ఉన్నారు. ప్రస్తుతం CID కోర్ట్ లో విచారణ జరుగుతుంది.

Read Also : Section 49 – Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ పిటిషన్.. సెక్షన్ 409పై వాదనలు.. ఏమిటిది ?

ఇదిలా ఉంటె CBI కోర్ట్ లో చంద్రబాబు ను చూసి ఆయన సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneswari ) ఎమోషనల్ అయ్యారు. ఇదే క్రమంలో ప్రజాక్షేత్రంలోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి (Nara Brahmani)లు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు, లోకేష్‌లపై వేధింపులకు పాల్పడుతున్నారని.. తప్పుడు కేసులో వేధిస్తున్నారని న్యాయం మీరే చెప్పాలని వారు ప్రజల వద్దకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఈ అంశంపై టీడీపీ సినీ నేతలు ఇప్పటికే ఓ కార్యాచరణ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. నారా లోకేష్ పైనా సీఐడీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను కూడా అరెస్ట్ చేస్తామని పరోక్షంగా చెప్పారు. ఒక వేళ అదే జరిగితే పాదయాత్ర ఆపేయాల్సి ఉంటుంది. అందుకే.. వెంటనే.. విరుగుడుగా.. భువనేశ్వరి, బ్రాహ్మణిలు పార్టీ తరపున రంగంలోకి దిగి.. లోకేష్ ఆపేసిన దగ్గర్నుంచి పాదయాత్ర చేయడం చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

రాజకీయాల్లో సానుభూతి మించిన అస్త్రం మరోటి లేదు. ఈ సానుభూతి తోనే వైస్ రాజశేఖర్ రెడ్డి , ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. వైఎస్ చనిపోయిన తర్వాత సానుభూతి అస్త్రం తో జగన్ ప్రజల్లోకి వెళ్లారు. ఉపఎన్నికల్లో భారీ విజయాలు సాధించారు. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ ఆ సానుభూతి వేవ్ కనిపించింది. గత ఎన్నికల్లోనూ ఆయన ఒక్క చాన్స్ అని ప్రజలను వేడుకున్నారు. ప్రజల్లో టిడిపికి వ్యతిరేకత లేనప్పటికీ జగన్ ఫై సానుభూతి తో ప్రజలు ఆయనకు ఓటువేసి గెలించారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు..ఆయన తల్లి విజయమ్మ , సోదరి షర్మిల పార్టీ పగ్గాలు పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి జగన్ గెలుపు కోసం పోరాటాం చేసారు. ఈ సానుభూతి కూడా జగన్ గెలుపుకు కారణమైంది.ముఖ్యంగా మహిళల్లో సానుభూతి పవనాలు వీస్తే ఫలితాలు పూర్తి స్థాయిలో ఏకపక్షమవుతాయన్న అంచనాలు ఉన్నాయి.

Read Also : TDP Leaders – House Arrests : బాబుకు బెయిల్ పై హైటెన్షన్.. టీడీపీ నేతల హౌస్ అరెస్టులు

రాజకీయాల్లో ప్రజలు ఎప్పటికి ఒకే వ్యక్తికి పట్టం కట్టారు. ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నారని అనిపిస్తే.. ప్రజలు మరోసారి అధికారం అప్పగించడానికి సంశయిస్తారు. వేధింపులకు గురైన వారికి బాసటగా నిలుస్తారు. ఇది ఈరోజుది కాదు అనాదిగా వస్తున్న రాజకీయం. అయితే కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల ఎజెండా కాలేదు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉండేది. ఇప్పుడు ఏపీలో ఆ తరహా రాజకీయాలు వచ్చాయి. అందుకే ఏపీ రాజకీయాల్లో రానున్న రోజుల్లో కీలక మార్పులు ఖాయమన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ను అరెస్ట్ చేసి వైసీపీ సంబరాలు చేసుకుంటుంది కానీ ప్రజలు మాత్రం జగన్ కు ఓటు వేసి తప్పు చేశామని..మరోసారి ఆ తప్పు చేయకూడదని ఫిక్స్ అవుతున్నారు. ఇది జగన్ ఆలోచించకుండా తప్పు మీద తప్పు చేస్తున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Chandrababu Arrest
  • CID
  • jagan
  • nara bhuvaneshwari and brahmani campaign
  • nara bhuvaneswari
  • nara brahmani
  • nara lokesh arrest
  • tdp

Related News

CM Chandrababu and his wife perform special prayers to Goddess Gangamma in Kuppam.

AP CM Chandrababu Naidu: కుప్పంలో గంగమ్మ తల్లికి సీఎం చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు

సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి తమ నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు కుప్పంలోని ప్రసిద్ధ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు తన నియోజకవర్గానికి రావడం ఇదే తొలిసారి. ఈ రోజు ఉద‌యం కుప్పం చేరుకున్న చంద్రబాబ

    Latest News

    • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

    • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

    • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

    • Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    Trending News

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd