Murder : బెంగుళూరులో దారుణం.. మద్యం మత్తులో పక్కింటి వ్యక్తిపై…!
బెంగుళూరులోని సిద్ధాపురలో దారుణం చోటుచేసుకుంది. తన భార్యను అసభ్య పదజాలంతో దూషించడంతో ఓ వ్యక్తి తన
- By Prasad Published Date - 06:40 AM, Tue - 14 March 23

బెంగుళూరులోని సిద్ధాపురలో దారుణం చోటుచేసుకుంది. తన భార్యను అసభ్య పదజాలంతో దూషించడంతో ఓ వ్యక్తి తన పక్కింటి వ్యక్తిపై దాడి చేసి హత్య చేశాడు. నిందితుడు సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు మణికంఠగా గుర్తించారు. ఇది మద్యం మత్తులో జరిగిన గొడవని.. మణికంఠ సురేష్ భార్య గురించి మాట్లాడినప్పుడు మద్యం మత్తులో ఉన్నాడని.. ఆవేశంలో సురేష్ కొట్టి మణికంఠను చంపాడని సౌత్ డీసీపీ తెలిపారు. హత్యను కప్పిపుచ్చేందుకు సురేష్ స్వయంగా మణికంఠ కుటుంబీకుల వద్దకు వెళ్లి మద్యం తాగి తన వద్ద పడి ఉన్నాడని చెప్పాడు. మణికంఠ మృతి గురించి తెలియని కుటుంబసభ్యులు అతడిని తీసుకొచ్చేందుకు వెళ్లారు.కుటుంబీకులు అతడి వద్దకు వెళ్లి చూడగా.. మణికంఠ ముక్కు నుంచి రక్తం రావడం గమనించారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మణికంఠ తలకు గాయాలైనట్లు విక్టోరియా ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగం, పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. వీడియోలు, ఇతర ఆధారాల ఆధారంగా ఐపీసీ సెక్షన్ 302, 303 కింద హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.

Related News

Road Accident : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ట్రాక్టర్ ట్రాలీని ఢీకొనడంతో ఇద్దరు