Vijaya Sai Reddy: ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి!
కేంద్రప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు
- Author : Balu J
Date : 08-02-2022 - 3:03 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్రప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోరారు. బడ్జెట్ సమావేశాలలో భాగంగా జీరో అవర్ లో ఆయన మాట్లాడుతూ.. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 8 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలున్నాయన్నారు. వీటిలో ఒక లక్ష ఉద్యోగాలు సైన్యంలో ఉండగా….. 2 లక్షల ఉద్యోగాలు రైల్వేలో ఉన్నాయన్నారు. వీటిని వార్షిక క్యాలెండర్ల ప్రకారం భర్తీచేస్తే యువతకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న జాప్యాన్ని, తద్వారా నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించి ఉద్యోగార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. pic.twitter.com/jDWmTExwvi
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 8, 2022