HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Making Payments With Upi These Precautions Are Mandatory

UPI Payments: యూపీఐతో చెల్లింపులు చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

సైబర్‌ నేరగాళ్ల మాయలో పడి అనేక మంది తాము కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్‌లతో అమాయకులకు టోపీ..

  • Author : Maheswara Rao Nadella Date : 27-03-2023 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
UPI Transaction Fees

UPI Payments : సైబర్‌ నేరగాళ్ల మాయలో పడి అనేక మంది తాము కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్‌లతో అమాయకులకు టోపీ పెడుతున్నారు. ఇటీవల ముంబైలో సైబర్ మోసగాళ్లు ఏకంగా 81 మంది యూజర్లకు టోపీ పెట్టి ఏకంగా కోటి రూపాయలను కాజేశారు.

పొరపాటున మీ అకౌంట్‌కు డబ్బు పంపించామంటూ నిందితులు అమయాకులను తొలుత బట్టులోవేసుకున్నారు. అయ్యో పాపం అనుకున్న యూజర్లు నిందితులకు సూచించిన నెంబర్లకు డబ్బు పంపించడం, ఫలితంగా వారి బ్యాంకు అకౌంట్లు ఖాళీ కావడంతో లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో.. పేమెంట్ మిస్టేక్ పేరిట స్కామర్లు కొత్త పథకానికి తెరలేపారంటూ పోలీసులు ప్రజలను తాజాగా అప్రమత్తం చేశారు. ఇలాంటి ఫోన్లు వస్తే వెంటనే సంబంధిత బ్యాంకులను సమాచారం అందించాలని సూచించారు. UPI చెల్లింపుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు.

సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు..

అధికారిక యాప్‌ స్టోర్లలోని బ్యాంకులకు చెందిన అఫీషియల్ యూపీఐ యాప్స్‌ను మాత్రమే వినియోగించాలి. ఇతరుల ఊహకు అందని విధంగా యూపీఐ పిన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. పుట్టినరోజు, ఫోన్‌నెంబర్లతో పోలిన నెంబర్లను యూపీఐ పిన్‌గా అస్సలు వాడొద్దు.

యూపీఐతో చెల్లింపులు జరపాలంటే పిన్ తప్పనిసరి. కాబట్టి.. పిన్ నెంబర్ ఎవరితోనూ పంచుకోవద్దు. నమ్మకస్తులు, స్నేహితులకైనా సరే ఎట్టిపరిస్థితుల్లోనూ మీ పిన్ నెంబర్ చెప్పొద్దు. డబ్బు ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వారి వివరాలను ఒకటికి రెండు మార్లు క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. పేరు, యూపీఐ ఐడీ, ఇతర సంబంధిత వివరాలు సరైనవో కావో పరిశీలించుకోవాలి.

యూపీఐ పిన్ నెంబర్, అకౌంట్ వివరాలు కోరుతూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్లు, ఎస్‌ఎమ్‌ఎస్‌లకు స్పందించకపోవడమే మంచిది. పొరపాటున డబ్బు పంపించామంటూ యూపీఐ మోసాలకు పాల్పడేవారి ఉదంతంతాలు ఇటీవల అనేకం వెలుగు చూశాయి. ఒక విడతలో ఎంత మొత్తం ట్రాన్స్‌ఫర్ చేయచ్చనేదానిపై పరిమితి విధించుకుంటే మంచిది. ఇందుకు సంబంధించిన సెట్టింట్స్ యూపీఐ యాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఒక విడతలో చాలా తక్కువమొత్తమే బదిలీ చేసేలా ఆప్షన్ ఎంచుకుంటే మాల్‌వేర్ బారినపడ్డ సందర్భాల్లో నష్టం తక్కువగా ఉంటుంది.

యూపీఐ యాప్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. కొత్త కొత్త మాల్‌వేర్స్ బారిన పడకుండా ఉండాలంటే దీనికి మించిన మార్గం మరొకటి లేదు. యూపీఐ చెల్లింపులపై నిత్యం ఓ కన్నేసి ఉంచాలి. ఏదైనా ట్రాన్సాక్షన్ అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించాలి.

Also Read:   Online Games: ఆన్‌లైన్ గేమ్స్ ఆడే వారికి బ్యాడ్ న్యూస్..ఇక గెల్చుకునే ప్రతి రూపాయిపై 30 శాతం ట్యాక్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Making
  • Mandatory
  • payments
  • precautions
  • special
  • UPI

Related News

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd