HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tg Inter Telangana Intermediate Schedule Released Effective Today

TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

  • Author : Vamsi Chowdary Korata Date : 12-05-2026 - 5:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Inter Admissions
Telangana Inter Admissions

తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప్రవేశాలు నేటి (మే 12) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి పాత విధానాన్నే కొనసాగించాలని ఆదేశించారు. జూన్ 1 నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రవేశాల సమయంలో విద్యార్థులు ఆధార్ కార్డుతో పాటు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామంటూ యాంటీ డ్రగ్ అఫిడవిట్ సమర్పించడం తప్పనిసరి చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ సోమవారం సవరించిన అడ్మిషన్ షెడ్యూల్‌ను జారీ చేశారు. దీని ప్రకారం నేటి (మే 12) నుంచి విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవచ్చు. గతంలో మే 8నే ప్రవేశాలు ప్రారంభం కావాల్సి ఉన్నా.. విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలనే ప్రభుత్వ ఆలోచనతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం పాత పద్ధతిలోనే ప్రవేశాలు నిర్వహించాలని స్పష్టం చేయడంతో అడ్మిషన్ల సందడి మొదలైంది.

ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి సీబీఎస్‌ఈ తరహాలో 11, 12 తరగతులను పాఠశాల విద్యలో విలీనం చేయాలని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనివల్ల పదో తరగతి తర్వాత డ్రాపౌట్ల సంఖ్య తగ్గుతుందని భావించారు. అయితే ఈ హడావిడి విలీనంపై పలు ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విలీన ప్రక్రియలో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ విద్యా సంవత్సరానికి విలీన ప్రక్రియను వాయిదా వేశారు. ఈ అంశంపై శాసనసభలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియలో ప్రభుత్వం కొన్ని కీలక నిబంధనలను ప్రవేశపెట్టింది. అడ్మిషన్ పొందే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆధార్ కార్డును సమర్పించాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా.. రాష్ట్రంలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు యాంటీ డ్రగ్ అఫిడవిట్‌ను తప్పనిసరి చేశారు. తాము మత్తు పదార్థాలను వినియోగించబోమని, విక్రయించబోమని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతకం చేసిన అఫిడవిట్‌ను కళాశాల యాజమాన్యానికి అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాలేజీలో అడ్మిషన్ లభిస్తుంది. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం కానున్నాయి.

ఇక నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం నూతన విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో జరిగిన విద్యా వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు సమగ్ర విద్యా విధానాన్ని అమలు చేస్తామని, విద్యా బడ్జెట్‌ను క్రమంగా 15 శాతానికి పెంచుతామని ప్రకటించారు. ఉత్తమ నైపుణ్యం కనబరిచే 500 మంది ఉపాధ్యాయులను ఏటా విదేశీ అధ్యయన యాత్రలకు పంపనున్నట్లు వెల్లడించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • inter Admission
  • Schedule Released
  • telangana government
  • Telangana Inter Admissions

Related News

Good news from the Telangana government: Free health check-ups for state employees over the age of 40.

Telangana Government: తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. రాష్ట్రంలో 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు ఫ్రీ హెల్త్ చెకప్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం (NEHS) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా 40 సంవత్సరాల వయస్సు దాటిన ఉద్యోగులు, పెన్షనర్లకు ఏటా ఒకసారి ఉచితంగా సమగ్ర ‘మాస్టర్ హెల్త్ చెకప్’ సేవలను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఉన్న లోపాలను సరిదిద్ది, నాణ్యమైన

  • New pensions... Minister Seethakka shares good news for single women.

    Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

  • Telangana government's key decision... fantastic news for Gram Panchayats...

    Telangana Govt: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రామ పంచాయతీలకు అదిరిపోయే శుభవార్త..

  • A flurry of appointments in the Congress... Ministerial berths confirmed for those two... Here are the contenders in the race.

    Revanth Reddy Cabinet: కాంగ్రెస్‌లో పదవుల జాతర.. ఆ ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం.. రేసులో ఉన్నది వీరే

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd