Delhi’s Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 26 మంది సజీవ దహనం
శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధాని జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 26 మంది మరణించారు.
- Author : Balu J
Date : 13-05-2022 - 11:51 IST
Published By : Hashtagu Telugu Desk
శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధాని ముండ్కా ప్రాంతంలో మూడు అంతస్తుల భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 26 మంది మరణించినట్లు అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. “ఇప్పటి వరకు మేము 26 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది” అని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ మీడియాకు తెలిపారు. అయితే, ఇప్పటి వరకు 26 మంది దుర్మరణం పాలైనట్లు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై సాయంత్రం 4.40 గంటలకు తమకు కాల్ వచ్చిందని అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారి తెలిపారు. మూడు అంతస్తుల భవనం నుండి భారీ మంటలతో పాటు దట్టమైన పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనను ఉపయోగించి మంటలపై నీటిని చల్లడానికి ప్రయత్నించింది. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. “పోలీసు అధికారులు భవనం కిటికీలను పగలగొట్టారు. సకాలంలో ఆసుపత్రికి తరలించిన చాలా మందిని రక్షించారు” అని అధికారి చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో మరణించినవాళ్ల సంఖ్య పెరిగే సూచనలున్నాయి.