Lok Sabha Elections 2024: పంజాబ్ కాంగ్రెస్ మూడో జాబితా విడుదల
లోకసభ ఎన్నికలకు గానూ పంజాబ్ కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితమే నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గురుదాస్‌పూర్ నుంచి సుఖ్‌జిందర్ రంధవా, లూథియానా నుంచి అమరీందర్ సింగ్ రాజా,
- By Praveen Aluthuru Published Date - 01:27 PM, Mon - 29 April 24

Lok Sabha Elections 2024: లోకసభ ఎన్నికలకు గానూ పంజాబ్ కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితమే నాలుగు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గురుదాస్‌పూర్ నుంచి సుఖ్‌జిందర్ రంధవా, లూథియానా నుంచి అమరీందర్ సింగ్ రాజా, వాడింగ్ ఖదూర్ సాహిబ్ నుంచి కుల్బీర్ జిరా, ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి విజయ్ ఇందర్ సింగ్లాలకు టిక్కెట్లు ఇచ్చారు. అంతకుముందు పంజాబ్ కాంగ్రెస్ రెండు జాబితాలను విడుదల చేసింది.
పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అంటే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో 65.94% శాతం ఓట్లు పోల్ అయ్యాయి. గతసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. పంజాబ్ ప్రస్తుత ముఖ్యమంత్రి గత ఎన్నికలల్లో సంగ్రూర్ సీటు నుండి పోటీ చేశారు. పంజాబ్‌లో 2019 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40.12% ఎంత శాతం ఓట్లు వచ్చాయి.
Also Read: Savita Pradhan: ఓ IAS సక్సెస్ స్టోరీ..చదివితే కన్నీళ్లు ఆగవు..!