KTR: ఎమ్మెల్యేగా కేటీఆర్ ప్రమాణస్వీకారం వాయిదా, కారణమిదే!
- By Balu J Published Date - 01:39 PM, Sat - 9 December 23
KTR: కేసీఆర్ సర్జరీ నేపథ్యంలో కేటీఆర్ మరో రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ సర్జరీ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాలేకపోయారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరొక రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కేటీఆర్ కోరారు.
కేసీఆర్ వెంట ఆస్పత్రిలో ఉన్నందున ఈరోజు తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి కూడా కేటీఆర్ హాజరు కాలేకపోయారు. కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఎమ్మెల్యేగా మరోరోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
Also Read: Deepika Padukone: లిప్ లాక్ సీన్లలో రెచ్చిపోయిన దీపికా, హృతిక్ తో బెస్ట్ కెమిస్ట్రీ