Telangana Jobs Notification: నిరుద్యోగులకు భృతి ఎక్కడ.. కోదండరామ్ షాకింగ్ రియాక్షన్..!
- By HashtagU Desk Published Date - 12:21 PM, Wed - 9 March 22

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర నిరుద్యోగులపై వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వెంటనే 80,039 ఉద్యోగాలకు నేటి నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, అలాగే 11 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ పై తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ స్పందించారు. కేసీఆర్ ప్రకటన సంతృప్తికరంగా లేదని కోదండరామ్ అన్నారు.
రాష్ట్రంలో 1,92 వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటే, కేవలం 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. అలాగే తెలంగాణలో ఇప్పటి వరకు 1,30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని కేసీఆర్ ప్రకటించారని, అది పూర్తిగా అవాస్తవమని, పచ్చి అబద్దాలు ఆడడంలో కేసీఆర్‌ని మించినోళ్ళు లేరని కోదండరామ్ వ్యాఖ్యానించారు. రు. అంతే కాకుండా నిరుద్యోగులకు భృతి ఎక్కడని ప్రశ్నించిన కోదండరామ్.. కేసీఆర్ ప్రకటణలో నిరుద్యోగ భృతి అనేది లేనే లేదని కోదండరామ్ అన్నారు. ఇక 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామన్న కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తామని, అయితే ప్రయివేటు ఉద్యోగాల్లో కూడా దీనిని అమలు చేయాలని కోదండరామ్ అన్నారు. ఇక ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోదండరామ్ కోరారు.