Khammam Congress MP Ticket: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసులో తెరపైకి కొత్త పేరు..!
దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల (Khammam Congress MP Ticket) వాతావరణం నెలకొంది. అయితే ఈ ఎన్నికలను తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
- By Gopichand Published Date - 11:07 AM, Wed - 10 April 24

Khammam Congress MP Ticket: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల (Khammam Congress MP Ticket) వాతావరణం నెలకొంది. అయితే ఈ ఎన్నికలను తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ స్థానాలకు ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనీసం 14 స్థానాలను గెలిపించేలా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ టికెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి నుంచి బీఆర్ఎస్‌కు పట్టులేని ఈ జిల్లాలో కాంగ్రెస్ అధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. అయితే ఈ ఖమ్మం ఎంపీ టికెట్ కోసం పలువురు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి మధ్య టికెట్ వార్ నడుస్తోంది.
అయితే ఈ ఖమ్మం ఎంపీ టికెట్‌పై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ టికెట్‌ను జిల్లా నాయకులకు కాకుండా నిజామాబాద్ జిల్లా ప్రముఖ నేతకు ఇవ్వనున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా కమ్మ నాయకుడు, సీఎం రేవంత్‌కు సన్నిహితుడిగా పేరు గాంచిన మండవ వెంకటేశ్వరరావుకు ఖమ్మం ఎంపీ టికెట్‌ను కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలోని భట్టి భార్య నందినికి, పొంగులేటి సోదరుడు ప్రసాద్‌కు చెక్ పెట్టేందుకే స్థానికేతురుడికి టికెట్ ఇస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read: 7 KG Gold Ramayana : 7 కేజీల బంగారంతో ‘రామాయణ’ గ్రంథం.. అయోధ్య రామయ్యకు కానుక
ఒకవేళ మండవ వెంకటేశ్వరరావుకి ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ సెల్ప్ గోల్ వేసుకున్నట్లే అని, ప్రతిపక్షమైన బీఆర్ఎస్ విజయం సాధించటానికి అవకాశం ఇచ్చినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియాలంటే మరో వారం ఆగాల్సిందేనని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. మరీ ఖమ్మం హస్తం టికెట్ స్థానికేతురుడికి పోతుందా..? జిల్లా నాయకులకే వస్తుందా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
We’re now on WhatsApp : Click to Join
పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి
రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాలకు ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. వారి పేర్లను 2-3 రోజుల్లో వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు CM రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో ఆయన చర్చించిన అనంతరం ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయవచ్చని తెలుస్తోంది.