Kerala Student: తల్లి కోసం రోబోని సృష్టించిన కొడుకు.. వీడియో వైరల్?
సాధారణంగా ఇంట్లో ఆడవారు వంటలు చేయడం, పిల్లలను స్కూలుకి పంపడం, భర్తలను ఆఫీసుకు పంపడం, బట్టలు
- Author : Anshu
Date : 24-10-2022 - 5:45 IST
Published By : Hashtagu Telugu Desk
సాధారణంగా ఇంట్లో ఆడవారు వంటలు చేయడం, పిల్లలను స్కూలుకి పంపడం, భర్తలను ఆఫీసుకు పంపడం, బట్టలు ఉతకడం ఇలా ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మహిళలు ఇన్ని పనులు చేసి అలసిపోతూ ఉంటారు. అయితే ఒక కొడుకు తన తల్లి ఈ విధంగా కష్టపడటం చూసి తన తల్లి కష్టాన్ని చూడలేక తన తల్లి కోసం ఏకంగా ఒక రోబో ని క్రియేట్ చేశాడు. కుర్రాడు తయారు చేసిన రోబో తన తల్లికి ఇంటి పనులకు ఉపయోగపడుతుందట. పూర్తి వివరాల్లోకి వెళితే..
కేరళ, కన్నూర్ జిల్లా,కూతుపరంబ ప్రాంతానికి చెందిన వెంజెడ్ అనే గ్రామంలో మొహమ్మద్ షియాద్ అనే కుర్రాడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే అతని స్కూల్ ప్రాజెక్టులో భాగంగా ఒక రోబోను తయారు చేశాడు. తల్లికి ఇంటి పనుల్లో ఉపయోగపడాలని కోరుకున్న అతను తన స్నేహితుడు అర్జున్ సహాయంతో కలిసి ఒక రోబోను రూపొందించాడు. అందుకోసం అతడు ఎమ్ ఐ టి యాప్,ఆండ్రాయిడ్, అడ్మెగా కంట్రోలర్ వంటివి ఉపయోగించాడు. వాటితో పాటుగా ప్లాస్టిక్ స్టూల్ అల్యూమినియం షీట్ ఫిమేల్ డమ్మీ సర్వీసింగ్ ప్లేట్ వంటి మెటీరియల్స్ తయారు చేశాడు.
కాగా ఆ రోబో అల్ట్రాసోనిక్ సెన్సార్ తో పనిచేస్తుందట. అయితే ఆ రోబో ఆటోమేటిక్,మాన్యువల్ అనే రెండు మోడ్ లలో పనిచేస్తుందట. కదా ఆ రోబో ఐదు నుంచి ఆరు కేజీల బరువును మోయగలదు. అంతే కాకుండా ఈ రోబో ఒక చోట నుంచి మరొక చోటికి ప్రయాణిస్తుందట. అయితే ఆ రోబోను తయారు చేసిన తర్వాత తన తల్లికి కొంతమైనా భారం తగ్గింది అని మహమ్మద్ అంటున్నాడు. ఈ రోబో ఆహారాన్ని అందించడం న్యూస్ పేపర్ తీసుకురావడం వంటి పనులు చేస్తుందట. అయితే ఈ రోబోని తయారు చేయడానికి పదివేల రూపాయలు ఖర్చు అయినట్లు మహమ్మద్ తెలిపాడు. ఆ రోబోను చూడటం కోసం ఇరుగుపొరుగువారు చాలామంది తన ఇంటికి వస్తున్నారని అందుకు తనకు చాలా ఆనందంగా ఉన్నట్లు తెలిపాడు.