HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kcr Announced Brs Party Whips

BRS : బీఆర్ఎస్ పార్టీ విప్‌లను ప్రకటించిన కేసీఆర్

ఈ మేరకు శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను, శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌ ను నియమిస్తూ కేసీఆర్ ఆదేశాలిచ్చారు.

  • Author : Latha Suma Date : 04-02-2025 - 1:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR announced BRS party whips
KCR announced BRS party whips

BRS : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఎట్టకేలకు శాసన మండలి, శాసన సభ లలో బీఆర్ ఎస్ పార్టీ విప్ లను ప్రకటించారు. ఈ మేరకు శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను, శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌ ను నియమిస్తూ కేసీఆర్ ఆదేశాలిచ్చారు. తెలంగాణ రాష్ట్రం మూడో అసెంబ్లీ కొలువుతీరిన 13నెలల తరువాత మండలి, శాసన సభలకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విప్ లను ప్రకటించడం గమానార్హం.

Read Also:Prayagraj : మహా కుంభమేళాకు వెళ్లనున్న ప్రధాని ..షెడ్యూల్‌ ఇదేనా..?

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 113స్థానాలకు గాను 64 స్థానాల్లో విజయం సాధించగా, 39చోట్ల బీఆర్ఎస్ గెలుపొందింది. బీజేపీ 8, మజ్లిస్ 7స్థానాల్లో విజయం సాధించగా, సీపీఐ ఒకచోట గెలుపొందింది. నూతన శాసనసభ్యులతో కొత్త శాసనసభ డిసెంబర్ 9న ఏర్పాటైంది. కుల గణన సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న తరుణంలో కేసీఆర్ పార్టీ విప్ లపై ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాక.. కాంగ్రెస్ పార్టీలో చేరిన 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ నేపథ్యంలో శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన సందర్భంలో విప్ ల ప్రకటన రాజకీయంగా మరింత ఆసక్తి రేపింది.

కాగా, కేసీఆర్ ప్రస్తుతం శాసన సభలో బీఆర్ఎస్ పక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అటు శాసన మండలి పక్ష నేతగా మాజీ స్పీకర్ జి.మధుసూధన చారి కొనసాగుతున్నారు. శాసన మండలి..శాసన సభలలో పార్టీ విప్ ల ప్రకటన నేపథ్యంలో ఇక సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టవచ్చని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.

Read Also: Cricketers Tax Strategy : తెలివైన పన్ను వ్యూహాలతో భారత క్రికెటర్ల తడాఖా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS Party Whip
  • kcr
  • KP Vivekananda Goud
  • Satyavati Rathod
  • telangana legislative council

Related News

Questions Asked By Sit To K

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అడిగిన ప్రశ్నలు

ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని నంది నగర్ ఉన్న కేసీఆర్ నివాసంలో మాదాపూర్ డీసీపీ రీతి రాజ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఐపీఎస్ అధికారుల బృందం సుమారు ఐదు గంటల పాటు ఆయనను విచారించింది

  • Kcr Nandinagar

    Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

  • Kcr Hc

    సిట్ నోటీసులపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారా ?

  • Kcr Pm 3

    ఫోన్ ట్యాపింగ్ పై గతంలో KCR చేసిన వ్యాఖ్యలు ఇవే..!!

  • Sit Inquiry Kcr

    నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

Latest News

  • విపక్ష ఎంపీల ఆందోళన – 8 మంది ఎంపీల సస్పెండ్

  • కావాలనే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు – రాహుల్

  • మజ్లిస్ పార్టీలో విషాదం..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత !

  • మణిపుర్ కొత్త సీఎంగా యుమ్నాం ఖేంచంద్

  • జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd