CM Nitish Kumar: ఢిల్లీలో నితీష్ ఆపరేషన్ సక్సెస్.. కేంద్రమంత్రి పదవి ఖరారు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఢిల్లీ నుంచి బీహార్ వరకు ఈ భేటీపై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఎన్డీఏ సాధించబోతున్న భారీ విజయంపై నితీశ్ కుమార్ ముందుగా ప్రధాని మోదీని అభినందించారు.
- By Praveen Aluthuru Published Date - 07:23 PM, Mon - 3 June 24

CM Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఢిల్లీ నుంచి బీహార్ వరకు ఈ భేటీపై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఎన్డీఏ సాధించబోతున్న భారీ విజయంపై నితీశ్ కుమార్ ముందుగా ప్రధాని మోదీని అభినందించారు. జూన్ 4న ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైతే కేంద్ర మంత్రివర్గంలో జేడీయూకు చోటు దక్కే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది.
బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు, అనంతరం హోంమంత్రి అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడారు. రాయితీ ఎన్నికల ఫలితాలకు ఒక్కరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నీతీశ్ భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. బీహార్ తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎన్డీయే విజయంపై ప్రధానితో ముఖ్యమంత్రి నితీష్ చర్చించినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి పాట్నాలోని ప్రధానమంత్రి రోడ్ షోకి హాజరయ్యారు. దీంతో పాటు కొన్ని ప్రధాని సమావేశాల్లో నితీష్ కుమార్ కూడా ఉన్నారు. అయితే ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్‌లో జేడీయూ భాగస్వామ్యమవుతుందనే చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొననున్నారు. సో మొత్తానికి నితీష్ ఢిల్లీ ఆపరేషన్ సక్సెస్ అయిందని తెలుస్తుంది.
Also Read: Ram Charan : ఈ నెలలో ఆ బహుమతి కోసం.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.. చరణ్ ఇస్తాడా..?